కావలసిన పదార్థాలు
- సోయా చిక్కుడు గింజలు. 150 గ్రా.
- ఉల్లిపాయలు. 80 గ్రా.
- టమోటోలు. 40 గ్రా.
- వెల్లుల్లి.20 గ్రా.
- అల్లం. 10 గ్రా.
- పచ్చి మిర్చి. 5 గ్రా.
- పసుపు. 5 గ్రా.
- ఛాట్ మసాలా. 5 గ్రా.
- రిఫైండ్ ఆయిల్. 5 మి.లీ.
- ఉప్పు. సరిపడా
తయారీ విధానం
సోయా చిక్కుడు గింజలను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి, ఆపై కుక్కర్‌లో పది నిమిషాలు ఉడికించాలి.
అల్లం, వెల్లుల్లి, టమోటో, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగి ఉంచుకోవాలి.
బాణెలి లో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి వేసి దోరగా వేయించాక, ఉల్లిపాయలు, టమోటో ముక్కలు వేసి సన్నటి సెగపై ఉడికించాలి.
ఆ తరువాత పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, సోయా గింజలు
వేసి రెండు నిమిషాలు ఉడికించాక రెండు కప్పుల నీళ్ళు పోసి మరో పది నిమిషాలు
సన్నని సెగపై ఉడికించాలి.
నీరంతా ఇగిరిపోయాక పైన ఛాట్ మసాలా చల్లి దించేయాలి. అంతే సోయా చిక్కుళ్ల మసాలా రెడీ.
No comments:
Post a Comment