మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయల్లో క్యాబేజీని కూడా చేర్చుకున్నట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దరిచేరకుండా చేయవచ్చు. అదెలాగంటే... క్యాబేజీలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారకాలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు.
ఎక్కువగా ఉడికించవద్దు క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం
క్యాబేజీలో ఉండే ఐసోసయనేట్లకు క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం కలదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు ఇది చక్కటి మందుగా పనిచేస్తుందని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది. దేశంలో ప్రతి సంవత్సరం అనేకమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నవారే కాగా, వారిలో 15 శాతం మంది పొగతాగని వాళ్లే కావడం గమనార్హం.
ఇందులో భాగంగా... పొగతాగనివారిపైన, మహిళలపైన పరిశోధన చేయగా, ప్రతిరోజూ లేదా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా క్యాబేజీ తీసుకుంటున్న వారిలో శ్వాసకోశాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. కాబట్టి, వారానికి ఒకసారి వెజిటబుల్ సలాడ్‌లో సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కూడా చేర్చి తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం ఉంది.
అందుకనే క్యాబేజీలను సలాడ్‌గా గానీ, ఆవిరితోగానీ ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అయితే పొగత్రాగని వారైనా, మహిళలైనా జన్యు పదార్థాలను బట్టి వీటి ప్రభావం ఉంటుందని గమనించాలి. ఇదిలా ఉంటే... క్యాబేజీ తినడం వల్ల క్యాన్సర్ బారినుండి తప్పించుకోవచ్చన్న అంశంపై ఇంకా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.
సాధారణంగా రోజుకు ఐదు లేదా ఆరు రకాల కూరగాయలను తప్పనిసరిగా తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని ఎన్నో రకాల పరిశోధనలు రుజువు చేశాయి.
No comments:
Post a Comment