కావలసిన పదార్థాలు
- వంకాయలు. 2
- బంగాళాదుంపలు. 4
- పసుపు. 1 టీస్పూ//.
- కారం. 2 టీస్పూ//.
- నూనె. వేయించేందుకు సరిపడా
- గరంమసాలా. 2 టీస్పూ//.
- నిమ్మరసం. 1 టీస్పూ//.
- కొత్తిమీర తురుము. కొద్దిగా
- ఉప్పు. తగినంత
- నూనె. నాలుగు టీస్పూ//.
తయారు చేయు విధానము :
వంకాయని పలుచని గుండ్రని ముక్కలుగా కోసి. వాటిమీద
ఉప్పు, కారం, పసుపు చల్లి పక్కన ఉంచాలి. బాణెలిలో నూనె పోసి ఈ ముక్కల్ని
వేయించి తీయాలి.
బంగాళాదుంప ముక్కల్ని ఉడికించి తొక్క తీసి, ఉప్పు, గరంమసాలా వేసి మెత్తగామెదపాలి.
వంకాయ ముక్కల్ని చిన్నపాటి చిప్పల్లా చేసి అందులో ఉడికించిన బంగాళాదుంప ముక్కల మిశ్రమాన్ని పెట్టాలి.
స్టవ్‌మీద
బాణెలి పెట్టి 2 టీస్పూన్ల నూనెని చిలకరించి బంగాళాదుంపల మిశ్రమం పెట్టిన
వంకాయ ముక్కల్ని బాణలిలో పెట్టి తక్కువ మంటమీద 2 నిమిషాలు మగ్గనిచ్చి
దించేయాలి.
చివరగా కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండి వడ్డించాలి. అంతే ఆలూ వంకాయ స్పెషల్ రెడీ .
No comments:
Post a Comment