Showing posts with label అన్నం రకాలు. Show all posts
Showing posts with label అన్నం రకాలు. Show all posts

Tuesday, May 8, 2012

ఉసిరికాయలతో పులిహోర


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఉసిరికాయలు. 8
  • బియ్యం. 1/2కేజీ
  • ఆవాలు. 1/2టీస్పూ//.
  • శెనగపప్పు. 2 టీస్పూ//.
  • పల్లీలు. 2 టీస్పూ//.
  • మినప్పప్పు. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 1 కట్ట
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 4
  • పచ్చిమిర్చి. 5
  • పంచదార. 1/4 టీస్పూ//.
  • నూనె. నాలుగు టీస్పూ//.
  • ఉప్పు. తగినంత.

తయారీ విధానం

ఉసిరికాయల్లో గింజ తీసి ఉప్పు చేర్చి ఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపి ముద్దలా చేయాలి.
అన్నం వండి చల్లార్చాలి. ఒక బాణెలి లో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి ఎర్రగా వేయించాలి.
అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి వేయించి దించేముందు పసుపు, కరివేపాకు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి వేయాలి.
ఈ మిశ్రమాన్ని వండి చల్లార్చి ఉంచిన అన్నంలో కలిపి ఉప్పు సరిచూడాలి. చివరగా పంచదార కూడా వేసి కలిపి ఓ గంటసేపు అలాగే ఉంచిన తరువాత తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉండే పులిహోర రెడీ.

కొత్తిమీర రైస్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బియ్యం. 1/2 కేజీ
  • కొత్తిమీర. పెద్ద సైజువి 7 కట్టలు
  • అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్. 2 టీస్పూన్లు
  • ఉప్పు. తగినంత
  • దాల్చిన చెక్క. 2 చిన్న ముక్కలు
  • లవంగాలు. 6
  • నూనె. సరిపడా

తయారీ విధానం

ముందుగా అరకేజీ బియ్యాన్ని ఉడికించి పొడి పొడిగా ఉండేలా అన్నం వార్చుకోవాలి.
కొత్తిమీరను తరిగి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.
తరువాత బాణెలి లో సరిపడా నూనె పోసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిల పేస్ట్, చెక్క, లవంగాలు, వేసి కాసేపు వేయించాలి.
ఆపై కొత్తిమీర పేస్టును కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న అన్నంలో పై మిశ్రమాన్ని, తగినంత ఉప్పును కలపాలి.
అన్నం మొత్తం కొత్తిమీర మిశ్రమం బాగా కలిసేలా కలపాలి.

వెజిటబుల్స్ మసాలా స్టఫ్ బిర్యాని


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • యాలకుల పొడి: 1 టీస్పూన్,
  • కొత్తిమీర:1 కట్ట,
  • పసుపు:1/2 టీస్పూ//,
  • పాలు: 1/4 లీ.
  • నెయ్యి:తగినంత,
  • రీఫైండ్ ఆయిల్: 100 గ్రా.
  • ఉప్పు:తగినంత,
  • కారం:1 టీస్పూ//,
  • పచ్చిమిర్చి పేస్ట్:1 టీస్పూ//,
  • పెరుగు:150గ్రా.
  • పుదీనా:1/2కప్పు,
  • వెజిటబుల్ ముక్కలు:4 కప్పు,
  • మసాలా దినుసులు:10 గ్రా.
  • బాస్మతి రైస్:1/2 కేజీ,
  • అల్లంవెల్లుల్లి పేస్ట్:1/2కప్పు,
  • ఉల్లిపాయలు:1కప్పు,

తయారీ విధానం

స్టౌవ్‌మీద బాణెలి ని ఉంచి అందులో నూనె పోసి మరిగాక.. మసాలా దినుసులను వేసి వేయించాలి.
అందులోనే పుదీనా,కొత్తిమీర,పసుపు,పచ్చిమిర్చి పేస్ట్,యాలక్కాయల పొడి,కారం,ఉప్పు,బీన్స్,క్యారెట్ టమోటో,ఉల్లిపాయ ముక్కలు,పెరుగులను ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.
ఇంకో గిన్నెలో బియ్యం ఎసరు పెట్టి, అందులో పాలు కూడా పోసి ఎసరు వచ్చాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి,సగం ఉడికాక గంజి వార్చేసి పక్కన ఉంచుకోవాలి.
వేరొక వెడల్పాటి పాత్రలో అడుగున ఉడికించిన రైస్ కొద్దిగా వేసి, పైన వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసి, మళ్లీ కొద్దిగా అన్నం.. ఇలా 4వరుసలుగా పేర్చుకోవాలి.
తర్వాత మూత పెట్టి 10ని. ఉడికించాలి. మూత తీసి సరిపడా నెయ్యేసి, అన్నాన్ని దించేయండి. బిర్యానీ రెడీ.

వెజిటబుల్ పులావ్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బియ్యం : 1/2 కిలో
  • కారెట్ : నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
  • బీన్సు: 100 గ్రా// ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
  • బంగాళా దుంపలు లేదా ఆలూ: 4-5 ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
  • ఉల్లిపాయలు : 5-6 ( పొడుగ్గా చీలికలు చేసుకోవాలి)
  • కాలిఫ్లవర్: ఒక చిన్న పువ్వు ( కావాలంటే వేసుకోవచ్చు )
  • పచ్చి బఠాణీ : ఒక కప్ ( నాన బెట్టినవి, లేదా తాజావి )
  • లవంగాలు: 5-6
  • యాలకులు : 5-6
  • దాల్చిన చెక్క : 5-6 చిన్న ముక్కలు
  • అల్లం వెల్లుల్లి ముద్ద : 2 టీ స్పూన్లు
  • నూనె , నేయ్యి లేదా డాల్డా : తగినంత
  • పచ్చిమిర్చి: 5-6 ( చీలికలు చేసుకోవాలి)
  • ధనియాలు, జీలకర్ర పొడి: 2 స్పూన్లు ( కావలిస్తే వేసుకోవచ్చు )
  • కారం: 1 స్పూను ( కారం ఇష్ట పడేవాళ్ళు వేసుకోవచ్చు )
  • పసుపు: చిటికెడు ( రంగు కోసం )
  • ఉప్పు : రుచికి తగినంత
  • నీరు: 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు
  • కొత్తిమీర: 1 కట్ట
  • పుదినా : 1/2 కట్ట ( తినేవారు వేసుకోవచ్చు)
  • జీడిపప్పు: 10-15 ( కావాలంటే వేసుకోవచ్చు)
  • బిర్యాని ఆకు : 2-3

తయారీ విధానం

ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.
ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి. అందులో సుమారు 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.
ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి.
వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగ నివ్వాలి.
ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
కుక్కర్ ఐతే మూడు కూతలు రాగానే కట్టేయ్యాలి. గిన్నెలో ఐతే అన్నం ఉడికాక గ్యాసు కట్టేయ్యాలి.

కట్టెపొంగలి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బియ్యం. 1/2కేజీ
  • ఛాయ పెసరపప్పు. 1/4కేజీ
  • ఎసరునీరు. 1.1/4 లీటర్
  • నెయ్యి. 150 గ్రా.
  • జీడిపప్పు. 50 గ్రా.
  • మిరియాలపొడి. 50 గ్రా.
  • ఉప్పు. తగినంత
  • కరివేపాకు. గుప్పెడు

తయారీ విధానం

బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి. ఎసట్లో వేసి ఉడికించాలి.
విడిగా మరో బాణెలిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు దోరగా వేగనిచ్చి కరివేపాకు, మిరియాల పొడి, జీలకర్ర వేసి సువాసన వచ్చేదాకా వేయించాలి.
ఇప్పుడు మూడువంతులుపైగా ఉడికిన అన్నంలో కరివేపాకు మిశ్రమం, మిగిలిన నెయ్యి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
సిమ్‌లో పెట్టి బాగా మగ్గిన తరవాత గిన్నె దించేయాలి. అంతే కమ్మటి సువాసనతో అలరించే పెప్పర్ రైస్ పొంగల్ రెడీ.