కావలసిన పదార్థాలు
- బియ్యం. 1/2కేజీ
- ఛాయ పెసరపప్పు. 1/4కేజీ
- ఎసరునీరు. 1.1/4 లీటర్
- నెయ్యి. 150 గ్రా.
- జీడిపప్పు. 50 గ్రా.
- మిరియాలపొడి. 50 గ్రా.
- ఉప్పు. తగినంత
- కరివేపాకు. గుప్పెడు
తయారీ విధానం
బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి. ఎసట్లో వేసి ఉడికించాలి.
విడిగా మరో బాణెలిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు
దోరగా వేగనిచ్చి కరివేపాకు, మిరియాల పొడి, జీలకర్ర వేసి సువాసన వచ్చేదాకా
వేయించాలి.
ఇప్పుడు మూడువంతులుపైగా ఉడికిన అన్నంలో కరివేపాకు మిశ్రమం, మిగిలిన నెయ్యి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
సిమ్‌లో పెట్టి బాగా మగ్గిన తరవాత గిన్నె దించేయాలి. అంతే కమ్మటి సువాసనతో అలరించే పెప్పర్ రైస్ పొంగల్ రెడీ.
No comments:
Post a Comment