కావలసిన పదార్థాలు
- కరివేపాకు. 1 కప్పు
- ఎండుమిర్చి. 4
- జీలకర్ర. 1 టీస్పూ//.
- ధనియాలు. 2 టీస్పూ//
- చింతపండు. సరిపడా
- మినప్పప్పు. 2 టీస్పూ//.
- శనగపప్పు. 2 టీస్పూ//
- వేరుశనగలు. 4 టీస్పూ//
- తురిమిన పచ్చి కొబ్బరి.. 1/4 కప్పు
- వెల్లుల్లి. 5 రెబ్బలు
- నెయ్యి. 2 టీస్పూ//
- నూనె. 1 టీస్పూ// .
- ఉప్పు. సరిపడా
తయారీ విధానం
మొదటగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు,
వేరుశెనగలు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే బాణెలి లో కరివేపాకు కూడా కరకర లాడేలా వేయించాలి. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి.
బాణెలీ లో నెయ్యి వేడి చేసి కరివేపాకుతో చేసిన
పొడికి కొబ్బరి పొడి కూడా కలిపి తడి ఆరిపోయి, పొడి పొడిగా అయ్యేదాకా
వేయించి దింపేయాలి. అంతే కరివేపాకు పొడి రెడీ.
No comments:
Post a Comment