కావలసిన పదార్థాలు
- కీర దోసకాయలు. 1/2 కేజీ
- టొమోటోలు. 200 గ్రా.
- పచ్చిమిరపకాయలు. 6
- నిమ్మకాయ. 1
- నూనె. 3 టీస్పూ//
- జీలకర్ర పొడి. 1/2 టీస్పూ//
- ఉప్పు. తగినంత
- చక్కెర. 2 టీస్పూ//
- కొత్తిమీర.2 కట్టలు
తయారు చేయు విధానం :
కీరదోసకాయలను చేదు లేకుండా చూసి, చెక్కుతీసి నిలువుగా కోసి విత్తనాలను తీసివేయాలి.
తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా నలుచదరంగా తరిగి చల్లటి నీటిలో వేయాలి.
టొమోటోలను కూడా నిలువుగా కోసి వాటి రసం, విత్తనాలను తీసివేసి సన్నగా తరగాలి.
పచ్చిమిర్చి, కొత్తిమీరలను సన్నగా తరిగి ఉంచాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి దానికి ఉప్పు, నిమ్మరసం,మిరియాలపొడి,
జీలకర్ర పొడి, చక్కెర చేర్చి. చేతి వేళ్లతో బాగా కలపాలి.
ఆ తర్వాత దాంట్లో తరిగి ఉంచిన టొమోటో ముక్కల్ని,
కీరదోస, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులను కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా
అయిన తరువాత సర్వ్ చేయాలి. దీనిని పూరీలతోనూ, చపాతీలతోనూ తినవచ్చు.
No comments:
Post a Comment