Wednesday, May 9, 2012

బెండ క్యాప్సికమ్ కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు :

  • బెండకాయలు. 1/4 కేజీ
  • అల్లం. 1 టీ.
  • పచ్చిమిర్చి. 5
  • క్యాప్సికమ్. 1
  • కార్న్‌ఫ్లోర్. 1 టీస్పూ//.
  • సోయాసాస్. 1 టీస్పూ//.
  • వెనిగర్. 2 టీస్పూ//.
  • అజినామోటో. కాస్తంత
  • ఉల్లికాడలు. 2
  • నూనె. 3 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • చక్కెర. తగినంత

తయరు చేయు విధానం :

ముందుగా బెండకాయలను రెండు వైపులా చివర్లు కట్ చేసి రెండేసి ముక్కలుగా కోసుకోవాలి.
సగం కార్న్‌ఫ్లోర్, సగం సోయాసాస్‌లలో ఉప్పు వేసి పలుచగా కలుపుకోవాలి.
దీంట్లో బెండ ముక్కలు వేసి పొయ్యిమీద పెట్టి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.
పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌లను కోసి, గింజలు తీసేయాలి.
బాణెలి లో నూనె వేశాక అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
మిగిలిన సోయాసాస్ వేసి మరికాసేపు ఉంచాలి.
ఆపై ఒక కప్పు నీళ్ళు, ఉప్పు, కొంచెం చక్కెర, అజినమోటో వేసి బాగా ఉడికించాలి.
బెండకాయ ముక్కలు వేసి కాసేపటికి కార్న్‌ఫ్లోర్ కొద్దిగా నీటిలో కలిపి పోయాలి.
కూర చిక్కబడ్డాక దించి వెనిగర్ కలిపి, ఉల్లికాడ ముక్కల్ని పైన అలంకరించి వడ్డించాలి.
ఈ కూరను ఫ్రైడ్‌రైస్‌కు సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

No comments:

Post a Comment