కావలసిన పదార్థాలు :
- క్యాబేజీ. మీడియం సైజుది 1
- పచ్చిమిర్చి. 4
- ఆవాలు. 1/2 టీస్పూ//.
- కరివేపాకు. 1 రెమ్మ
- కొబ్బరి. 1 టీస్పూ//.
- కొత్తిమీర తురుము. 1 టీస్పూ//.
- నూనె. 1 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
తయారు చేయు విధానము :
క్యాబేజీని సన్నగా తురమాలి. బాణెలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమన్నాక కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
తరవాత క్యాబేజీ తురుము, ఉప్పు వేసి రంగు మారకుండా ఐదు నుంచి పది నిమిషాలు వేయించి దించాలి.
తరవాత కొబ్బరి, కొత్తిమీర తురుము వేసి కలిపితే గ్రీన్ క్యాబేజ్ స్పెషల్ రెఢీ.
No comments:
Post a Comment