Showing posts with label రసాలు. Show all posts
Showing posts with label రసాలు. Show all posts

Tuesday, May 8, 2012

ఆమ్ కా షరబత్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడి రసం – ½ లీటరు
  • చక్కెర - 450 గ్రాములు
  • నీళ్ళు - 2 కప్పులు
  • పొటాషియం - చిటికెడు
  • ఎల్లో కలర్ - 1 టీస్పూ//

తయారీ విధానం

చక్కెరలో నీళ్ళు పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద పెట్టాలి.
ఇది చిక్క పడిన తర్వాత ముందుగా తీసి ఉంచుకొన్న మామిడిరసం, ఎల్లోకలర్, పొటాషియం అన్నీ కలపాలి. సెగమీద కాసేపు ఉంచుకోవాలి
చల్లారిన తర్వాత శుభ్రమైన సీసాలో నింపుకోవాలి.

పుచ్చకాయ స్మూతీ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పుచ్చకాయ ముక్కలు
  • స్ట్రాబెర్రీల గుజ్జు
  • ఐసు కోరు
  • ఒక చెంచాడు అల్లం రసం
  • ఒక చెంచాడు తేనె
  • ఉప్పు. తగినంత
  • రెండు లేదా మూడు పుదీన ఆకులు

తయారీ విధానం

పుచ్చకాయ ముక్కలకు ఒక కప్పు నీటిని, స్ట్రాబెర్రీల గుజ్జు, అల్లం రసం, తేనె, పుదీనా ఆకులు, ఐసు కోరును వేసి మిక్సీ చేసుకోవాలి.
అంతే చల్లచల్లని పుచ్చకాయ స్మూతీ రెడీ. ఎప్పుడూ తినే ముక్కలే కాక ఈ రకంగా చేసుకుంటే వెరైటీ కి వెరైటీ, ఇంకా రుచి కూడా.

బొప్పాయి సలాడ్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బొప్పాయి. 2 కప్పులు
  • చెర్రీస్‌‌. 2
  • చెంచాలు తేనె. 2 టీస్పూ//
  • ఫైనాఫిల్ ముక్కలు. 1 కప్పు
  • రోజ్‌వాటర్. 1/2 టీస్పూ//

తయారీ విధానం

ఒక పాత్రలో బొప్పాయి, ఫైనాపిల్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. వాటికి తేనె, రోజ్‌వాటర్ మిశ్రమాన్ని పట్టించాలి.
అనంతరం వీటిని నిమిషాల పాటు డీ‌ప్ ఫ్రిజ్‌లో పెట్టి తీయాలి. దీన్ని ఒక గాజు బౌల్‌లో వేసి పైన చెర్రీస్‌తో అలంకరించి సర్వ్ చేయాలి. 

పాలకూర సూప్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పాలకూర. 800గ్రా
  • వెజిటబుల్‌ స్టాక్. 1 లీటర్ (వెజిటబుల్‌ స్టాక్‌ కోసం. గాజర్‌, బీన్స్, గోబీ పువ్వు, ఉల్లిపాయలు, మిరియాలు లీక్‌, సెలరీ, కరివేపాకు అన్నీ వేసి ఒక గంటసేపు ఉడికించాలి. )
  • ఉప్పు. తగినంత
  • తెల్లమిరియాల పొడి. రుచికి సరిపడా
  • మైదా. 50 గ్రా
  • వెన్న. 100 గ్రా
  • క్రీం. 15 గ్రా

తయారీ విధానం

పాలకూరను ఉడకబెట్టి మెత్తగా నూరుకోవాలి. ఒక బాణెలి తీసుకొని అందులో వెన్న వెయ్యాలి.
వెన్న కరిగిన తర్వాత అందులో మైదా వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోనే పాలకూర పేస్ట్ వేసి వేయించాలి.
ఆ తర్వాత వెజిటబుల్‌ స్టాక్‌ పోసి సన్నని మంటపై 10 నిమిషాలు ఉడక నివ్వాలి.
చివర్లో తెల్ల మిరియాల పొడి చల్లి, తగినంత ఉప్పు వేసి, పైన క్రీం వేసి సర్వ్ చేయాలి.  

టొమోటో ఓక్రా సూప్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బెండకాయలు. 1/4 కేజీ
  • టొమోటోలు. 1/2 కేజీ
  • నూనె. వేయించేందుకు సరిపడా
  • బియ్యం. 1 టీస్పూ//.
  • మిరియాలపొడి. 1/2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • వెజిటబుల్ స్టాక్. 1/2 లీ.

తయారీ విధానం

బెండకాయలను సన్నటి చక్రాల్లాగా కోసి నూనెలో వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
వెజిటబుల్ స్టాక్‌ను మరిగించి, అందులో మెత్తగా గ్రైండ్ చేసిన టొమోటో గుజ్జును వేసి ఉడికించాలి.
దోరగా వేయించిన బియ్యాన్ని పొడి చేసుకుని, మరుగుతున్న సూప్‌లో వేసి, బాగా కలిపి, చిక్కబడేంతదాకా ఉడికించాలి.
దించేముందు ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి. చివర్లో వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా వేసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
అంతే టొమోటో ఓక్రా సూప్ రెడీ అయినట్లే.! నోట్ : వెజిటబుల్ స్టాక్ ఇంట్లోనే చేసుకోవాలంటే, ముప్1/4 లీటర్ నీటిలో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2కప్పు ఉల్లిపాయముక్కలు, 1/2 అంగుళం దాల్చిన చెక్క, టీస్పూన్ మిరియాలు, పలావు ఆకు, కాస్తంత కొత్తిమీర వేసి గంటసేపు సన్నటి మంటమీద ఉడికిస్తే. వెజిటబుల్ స్టాక్ తయారవుతుంది.

లెమన్ కొరియాండర్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • వెజిటబుల్ స్టాక్. 1 లీ.
  • కార్న్‌ఫ్లోర్. 50 గ్రా.
  • కొత్తిమీర. 1 కట్ట
  • నిమ్మకాయలు. 4
  • చిల్లీసాస్. మూడు టీస్పూ//.
  • అజినమోటో. 1 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

కొత్తి మీరను శుభ్రంచేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
ఓ గిన్నెలో వెజిటబుల్ స్టాక్‌ పోసి, వేడయ్యాక ఒక పొంగు రాగానే నీటిలో కలిపిన కార్న్‌ఫ్లోర్‌ను పోసి బాగా కలియబెట్టాలి.
సూప్‌ చిక్కబడగానే ఉప్పు కలిపి కప్పుల్లో పోయాలి. కప్పుల్లో పోసేముందు మాత్రమే నిమ్మరసం, కొత్తిమీర పేస్టును కలిపితే సరిపోతుంది.
అంతే వేడి వేడి లెమన్ కొరియాండర్ సూప్ రెడీ అయినట్లే.వెజిటబుల్ స్టాక్ తయారు చేయాలంటే.
ఇందుకోసం ఒకటిన్నర లీటర్ నీళ్లలో ఒక కప్పు క్యారెట్‌ముక్కలు, ఒక కప్పు ఉల్లిముక్కలు, అంగుళం దాల్చినచెక్క, ఒక టీస్పూను మిరియాలు, రెండు పలావు ఆకులు, పది కొత్తిమీర కాడలు వేసి గంటసేపు సన్నని మంటమీద మరిగించి దించేయాలి. అంతే వెజిటబుల్ స్టాక్ రెడీ.

గోల్డెన్ ఈగిల్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బొప్పాయి ముక్కలు. 1 కప్పు
  • మామిడి ముక్కలు. 1/2 కప్పు
  • పంచదార. 2 టీస్పూ//.
  • ఛాట్ మసాలా... 1/2 టీస్పూ//.
  • ఐస్ క్యూబ్స్. తగినన్ని
  • పుదీనా ఆకులు. కొద్దిగా

తయారీ విధానం

బొప్పాయి కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పంచదారలను మిక్సర్‌లో వేసి తగినన్ని నీళ్లుపోసి మెత్తగా అయ్యేంతదాకా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి, ఛాట్ మసాలా కలిపి, పైన ఐస్ క్యూబ్‌లు వేయాలి.
చివర్లో పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. 

క్యారెట్ శోర్భా


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • క్యారెట్. 1/4కేజీ
  • టొమోటో. 100 గ్రా.
  • కసూర్ మేతీ. 1 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 2
  • మిరియాలు. 1 టీస్పూ//.
  • పుదీనా. 1 కట్ట
  • నిమ్మరసం. 2 టీస్పూ//.
  • కొత్తిమీర. 1 కట్ట
  • ఉప్పు. తగినంత
  • నిమ్మచెక్క తురుము. చిటికెడు

తయారీ విధానం

క్యారెట్‌ను సన్నగా తురమాలి. టొమాటోలను సన్నగా కోయాలి. ఈ రెండింటినీ కలిపి ఓ గిన్నెలో వేసి, 3 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి.
ఓ సన్నని వస్త్రంలో ఎండుమిర్చి, మిరియాలు, కసూరిమేతీ, పుదీనా కలిపి మూటకట్టి ఉడుకుతున్న గిన్నెలో వేసి ఉడికించాలి.
పది నిమిషాలు అలాగే ఉడికించిన తరువాత ఆ మూటను గట్టిగా పిండి తీసేయాలి.
ఇప్పుడు ఉప్పు సరిచూసి ఈ రసాన్ని వడగట్టి, కప్పుల్లో పోసి నిమ్మరసం, నిమ్మచెక్క తురుము వేసి వేడిగా సర్వ్ చేయాలి. అంతే. క్యారెట్ శోర్భా రెడీ. 

గ్రీన్‌ సూప్‌


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఉల్లిపాయ. 1
  • నూనె. 1 టీస్పూ//.
  • వెజిటబుల్ స్టాక్. 2 కప్పులు
  • తోటకూర కట్టలు. 2
  • పాలకూర. 1 కట్ట
  • పాలు. 1 కప్పు
  • మీగడ. 2 టీస్పూ//
  • మిరియాలపొడి. కొద్దిగా
  • కొత్తిమీర. 1 కట్ట

తయారీ విధానం

ముందుగా తోటకూర, పాలకూరలను బాగా కడిగి సన్నగా తరగాలి.
తరవాత బాణెలి లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఓ నిమిషం వేయించి వెజిటబుల్ స్టాక్ పోయాలి.
ఆపై మంట తగ్గించి తరిగిన ఆకుకూరను పదిహేను నిమిషాలు ఉడికించి దించేయాలి.
చల్లారిన తరువాత అందులో పాలు పోసి మళ్లీ స్టవ్‌మీద పెట్టాలి.
కాసేపు ఉడికించి అందులో మిరియాలపొడి, మీగడ కలిపి చివర్లో కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి గ్రీన్ సూప్ తయార్.

పచ్చి మామిడికాయ షర్బత్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పచ్చిమామిడికాయ రసం – ¼ లీటరు
  • చక్కెర - 650గ్రాములు
  • ఉప్పు - 1 టీస్పూ//
  • కావల్సిన ఎసెన్స్

తయారీ విధానం

ముందు మామిడికాయ తొక్కతీసి, తురుము పీటతో తురుముకోవాలి.
తురుమును ఒక గిన్నెలో వేసి ఒక టీస్పూను ఉప్పు చేర్చి మూతపెట్టాలి.
సుమారు ఇరవై నిముషాల తర్వాత ఈ తురుమును గట్టిగా పిండితే రసం వస్తుంది. గుడ్డలో వేసి పిండితే శ్రమలేకుండా ఉంటుంది.
తర్వాత చక్కెర పాకం పట్టుకోవాలి.
ఈ పాకంలోకి పచ్చిమామిడిరసం కలపాలి. ఎసెన్స్ చేర్చాలి.
పచ్చిమామిడి షర్బత్ ను తడిలేని సీసాలోనే ఉంచుకోవాలి.
షర్బత్ చేసుకోవాలనుకున్నాప్పుడు, ఒక గ్లాసు నీటికి ఒక కప్పు షర్బత్ కలుపుకుని, బాగా కలిసేటట్టు చూసుకోవాలి. దీనికి ఐస్ ముక్కల జత చెర్చుకోవచ్చు.

మామిడి కాయ స్క్వాష్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడి కాయలు – 1 కేజీ
  • నీళ్ళు – 3 కప్పు
  • చక్కెర – 1.5 కేజీ
  • పొటాషియం బై సల్ఫేట్ – 2 టీస్పూ//
  • సిట్రిక్ ఆసిడ్ (ఆమ్లం) – ½ టీస్పూ//

తయారీ విధానం

మామిడికాయ తొక్కతీసి ముక్కలు చేయాలి.
ఈ ముక్కలను ఒక కప్పు నీటిలో బాగా ఉడకపెట్టుకోవాలి.
తర్వాత సెగపై నుంచి కిందికి దించి చల్లార్చుకోవాలి.
దీనిని గ్రైండ్ చేసుకొని గుజ్జుని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
నీళ్ళలో చక్కెర, సిట్రిక్ ఆసిడ్ వేసి బాగా కరిగేవరకూ ఉంచాలి.
మిగుళ్ళు యేమీ ఉండకుండా ఒకసారి వడకట్టుకుంటే మంచిది.
దీనికి పక్కన పెట్టుకున్న మామిడి గుజ్జును కలుపుకొని బాగా ఉడకనివ్వాలి.
తర్వాత పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి.
చల్లారిన సిరప్ కొంచం తీసుకొని దానికి పొటాషియం బై సల్ఫేట్ కలుపుకోవాలి.
మిశ్రమం బాగా కలిసేట్లు చూసుకోవాలి.
ఈ సిరప్ గాలిదూరని బాటిల్ లో భద్రపరచుకొని, ఫ్రిడ్జులో పెట్టుకోవాలి.
ఒక గ్లాసు స్క్వాషు తయారీకి ఒక గ్లాసు నీటిలో రెండు స్పూనుల సిరప్ కలుపుకుంటే చాలు.
దీనికి ఐస్ ముక్కలు జోడించండి.

బార్లీ షర్బత్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బార్లీ. 2 టీస్పూ//
  • నీళ్ళు. 2 కప్పుల నీళ్ళు
  • రుచి కోసమై నిమ్మకాయ రసము/తేనె /పంచదార

తయారీ విధానం

ముందుగా పావు కప్పు (అనగా రెండు ఔన్సులు) బార్లీని , కొంచెము చల్ల నీళ్ళలోనే బాగా కలిపి ఉంచుకోవాలి.
ఆ తర్వాత, బాగా తెర్లే నీళ్ళలో ఆ బార్లీ పిండి గుజ్జును బాగా కలపాలి.(మరిగే నీళ్ళలోకలిసి పోయేలా,గరిటతో కలియ త్రిప్పుతూ ). ఇలాగ చేయక పోతే, పిండి ఉండలు కడుతుంది.
తేనెను కానీ, చక్కెరను గానీ, జాగరీని గానీ రుచి కోసము వేసుకో వచ్చును.

ఆరెంజ్ స్క్వాష్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అప్పుడే తీసిన కమలారసం – 500 గ్రా//
  • నీళ్ళు - 300 గ్రా//
  • చక్కెర – 400 గ్రా//
  • గోరువెచ్చని నీళ్ళు – 3 టీస్పూ//
  • పొటాషియం బై సల్ఫేట్ – 3 టీస్పూ//
  • సొడియం బెంజోయేట్ - చిటికెడు

తయారీ విధానం

నీళ్ళలో చక్కెరవేసి బాగా కరిగేవరకూ ఉంచాలి.
మిగుళ్ళు యేమీ ఉండకుండా ఒకసారి వడకట్టుకుంటే మంచిది
దీనికి చల్లారిన తర్వాత కమలారసాన్ని బాగా కలుపుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి
గోరువెచ్చటి నీటిలో పొటాషియం బై సల్ఫేట్ , సొడియం బెంజోయేట్ కరిగించి, స్క్వాష్ సిరప్ కు కలపాలి.
మొత్తం మిశ్రమం బాగా కలిసేటట్టు చూసుకోవాలి.
ఈ సిరప్ గాలిదూరని బాటిల్ లో భద్రపరచుకొని, ఫ్రిడ్జులో పెట్టుకోవాలి.
ఒక గ్లాసు స్క్వాషు తయారీకి ఒక గ్లాసు నీటిలో రెండు స్పూనుల సిరప్ కలుపుకుంటే చాలు.
దీనికి ఐస్ ముక్కలు జోడించండి.

నిమ్మ స్క్వాష్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • నిమ్మకాయ రసం - 300 గ్రా//
  • చక్కెర - 600 గ్రా//
  • నీళ్ళు -300 గ్రా//
  • సిట్రిక్ ఆసిడ్ (ఆమ్లం) – ½ టీస్పూ//
  • నిమ్మ ఎసెన్సు - 1 టీస్పూ//

తయారీ విధానం

నీళ్ళలో చక్కెర, సిట్రిక్ ఆసిడ్ వేసి బాగా కరిగేవరకూ ఉంచాలి.
మిగుళ్ళు యేమీ ఉండకుండా ఒకసారి వడకట్టుకుంటే మంచిది.
దీనికి చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని కలుపుకోవాలి.
దీనికి కొంచం నిమ్మ ఎసెన్సు కలపాలి.
ఈ సిరప్ గాలిదూరని బాటిల్ లో భద్రపరచుకొని, ఫ్రిడ్జులో పెట్టుకోవాలి.
ఒక గ్లాసు స్క్వాషు తయారీకి ఒక గ్లాసు నీటిలో రెండు స్పూనుల సిరప్ కలుపుకుంటే చాలు.
దీనికి ఐస్ ముక్కలు జోడించండి.

జింజర్ షర్బత్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అల్లం - 300గ్రా.
  • నిమ్మకాయలు - 10
  • పంచదార - 500గ్రా.
  • ఉప్పు - 1 టీస్పూ//

తయారీ విధానం

అల్లంను శుభ్రంగా కడిగి, తుడిచి కాస్త నీళ్ళు చల్లుతూ తొక్కాలి ((అంటే రోట్లో చితకకొట్టుకోవాలి, లేకపోతే మిక్సీలో కచ్చా-పచ్చగా చేసుకోవాలి).
ఇలా రెండుసార్లు నీళ్ళు చల్లుతూ తొక్కి, సుమారు ఒక అరకప్పు రసం దాకా పిండుకోవాలి.
రసంలో తొక్క లేకుండా వడకట్టుకోవాలి.
నిమ్మరసం తీసి పలుచని బట్టలో వడకట్టి ఉప్పు కలపండి.
ఒక పాత్రలో పంచదార మరియు అల్లపురసం కలిపి సన్నని సెగమీద లేతపాకం వచ్చేదాక ఉంచి దించి ఆరిన తరువాత నిమ్మరసం కలపండి. బాగా ఆరిన తరువాత సీసాల్లో నింపుకోవాలి.