కావలసిన పదార్థాలు
- వెజిటబుల్ స్టాక్. 1 లీ.
- కార్న్‌ఫ్లోర్. 50 గ్రా.
- కొత్తిమీర. 1 కట్ట
- నిమ్మకాయలు. 4
- చిల్లీసాస్. మూడు టీస్పూ//.
- అజినమోటో. 1 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
కొత్తి మీరను శుభ్రంచేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఓ గిన్నెలో వెజిటబుల్ స్టాక్ పోసి, వేడయ్యాక ఒక పొంగు రాగానే నీటిలో కలిపిన కార్న్‌ఫ్లోర్‌ను పోసి బాగా కలియబెట్టాలి.
సూప్ చిక్కబడగానే ఉప్పు కలిపి కప్పుల్లో పోయాలి. కప్పుల్లో పోసేముందు మాత్రమే నిమ్మరసం, కొత్తిమీర పేస్టును కలిపితే సరిపోతుంది.
అంతే వేడి వేడి లెమన్ కొరియాండర్ సూప్ రెడీ అయినట్లే.వెజిటబుల్ స్టాక్ తయారు చేయాలంటే.
ఇందుకోసం ఒకటిన్నర లీటర్ నీళ్లలో ఒక కప్పు
క్యారెట్‌ముక్కలు, ఒక కప్పు ఉల్లిముక్కలు, అంగుళం దాల్చినచెక్క, ఒక
టీస్పూను మిరియాలు, రెండు పలావు ఆకులు, పది కొత్తిమీర కాడలు వేసి గంటసేపు
సన్నని మంటమీద మరిగించి దించేయాలి. అంతే వెజిటబుల్ స్టాక్ రెడీ.
No comments:
Post a Comment