కావలసిన పదార్థాలు
- బెండకాయలు. 1/4 కేజీ
- టొమోటోలు. 1/2 కేజీ
- నూనె. వేయించేందుకు సరిపడా
- బియ్యం. 1 టీస్పూ//.
- మిరియాలపొడి. 1/2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
- వెజిటబుల్ స్టాక్. 1/2 లీ.
తయారీ విధానం
బెండకాయలను సన్నటి చక్రాల్లాగా కోసి నూనెలో వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
వెజిటబుల్ స్టాక్‌ను మరిగించి, అందులో మెత్తగా గ్రైండ్ చేసిన టొమోటో గుజ్జును వేసి ఉడికించాలి.
దోరగా వేయించిన బియ్యాన్ని పొడి చేసుకుని, మరుగుతున్న సూప్‌లో వేసి, బాగా కలిపి, చిక్కబడేంతదాకా ఉడికించాలి.
దించేముందు ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి. చివర్లో వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా వేసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
అంతే టొమోటో ఓక్రా సూప్ రెడీ అయినట్లే.! నోట్ :
వెజిటబుల్ స్టాక్ ఇంట్లోనే చేసుకోవాలంటే, ముప్1/4 లీటర్ నీటిలో 1 కప్పు
క్యారెట్ ముక్కలు, 1/2కప్పు ఉల్లిపాయముక్కలు, 1/2 అంగుళం దాల్చిన చెక్క,
టీస్పూన్ మిరియాలు, పలావు ఆకు, కాస్తంత కొత్తిమీర వేసి గంటసేపు సన్నటి
మంటమీద ఉడికిస్తే. వెజిటబుల్ స్టాక్ తయారవుతుంది.
No comments:
Post a Comment