Friday, May 18, 2012

ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు.

ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ఇలా నమిలి తినడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దాదాపు 15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం ద్వారా 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తెలియవచ్చింది. ఇంకా 90 నిమిషాల పాటు ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆ స్టడీలో తేలింది.

No comments:

Post a Comment