Thursday, May 10, 2012

మెంతి పాలక్ చమన్


కావలసిన పదార్థాలు


  • పాలకూర. 2 కట్టలు
  • పనీర్. వంద గ్రా.
  • కోవా. 1/2 టీస్పూ//.
  • మెంతికూర. 1 కట్ట
  • నూనె. తగినంత
  • టొమాటోలు. 2
  • ఉల్లిపాయ. 1
  • గరంమసాలా. 1/2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత

తయారు చేయు విధానము :


పాలకూరను సన్నగా తరిగి ఉడికించి నీళ్లు వంపేయాలి. తరవాత దీన్ని మెత్తగా రుబ్బాలి.

బాణెలిలో నూనె వేసి కాగాక రుబ్బిన పాలకూర పేస్టు, కోవా, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి వేయించాలి.

చివరగా మెంతికూర కూడా వేసి ఉడికించి ఉప్పు, గరంమసాలా చల్లి బాగా కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మెంతి పాలక్ చమన్ రెడీ.

No comments:

Post a Comment