కావలసిన పదార్థాలు :
- గోరుచిక్కుడు. 1/2 కేజీ
- ఇంగువ. 1/4 టీస్పూ//.
- అల్లంవెల్లుల్లి. 2 టీస్పూ//.
- పసుపు. 1/2 టీస్పూ
- ధనియాలపొడి. 1 టీస్పూ//.
- మసాలాపొడి. 1 టీస్పూ//.
- కారం. 1 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
తయారు చేయు విధానము :
గోరుచిక్కుళ్లను అంగుళం చొప్పున ముక్కలుగా
కోసుకోవాలి. చిన్న కుక్కర్ లేదా ప్రెషర్‌పాన్‌లో తగినన్ని నీళ్లు పోసి
ఉడికించి, తరువాత నీళ్లు వంపేయాలి.
బాణెలిలో నూనె వేసి వేడి చేసి ఇంగువ, అల్లంవెల్లుల్లి వేసి గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి.
ఆపై ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు, మసాలా, ధనియాలపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఓ ఐదునిమిషాలు వేయించి తీయాలి. అంతే గోరు చిక్కుడు మసాలా రెడీ.
No comments:
Post a Comment