Showing posts with label చిరుతిండ్లు. Show all posts
Showing posts with label చిరుతిండ్లు. Show all posts

Thursday, May 3, 2012

తోటకూర ఉండలు

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బాగ కడిగి తరుగుకున్న తోటకూర - రెండు కట్టలు
  • శెనగపిండి - అర కప్పు
  • అల్లం-వెల్లుల్లి ముద్ద (వెల్లుల్లి వాడనివారు అల్లం కోరుకొని వేసుకోవచ్చు)
  • జీలకర్ర - తగినంత
  • పచ్చి మిరపకాయలు - రెండు
  • మిర్చి పొడి - అర చెంచా
  • ఉప్పు - తగినంత
  • నూనె - తగినంత
  • నీరు - తగినంత

తయారీ విధానం

ముందు ఒక గిన్నెలో, తరుగుకున్న తోటకూర, సన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి ముద్ద, కొంచెం మిర్చిపొడి, జీలకర్ర, శెనగ పిండి, ఉప్పు వేసి. ఉండల్లా చేసుకోవాలి.
అవసరమైతే కొంచం నీటితో తడుపుకొని ఉండాలని చేసుకోవచ్చు.
ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసుకొని, స్టవ్వు మీద పెట్టుకొని, ఉండల్ని వేపుకునేంత వేడి అయిన తర్వాత, ఒక్కొక్క ఉండని వేసుకొని, ఎర్రగా వేపుకోవాలి.
ఈ ఉండాలని వేడి వేడి గా తింటే బాగుంటుంది. అల్లం చట్నీ లేదా సాస్ తో తినవచ్చు

మామిడి కాయ సేమ్యా ఉప్మా

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఒకటిన్నర కప్పు సేమ్యా, నేతిలో ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొన్నది.
  • మూడు లేక నాలుగు పచ్చి మిరపకాయలు
  • అల్లం చిన్న ముక్క తరిగినది.
  • తొక్కు తీసి తురిమిన మామిడి కోరు - మూడొంతుల కప్పు
  • కాజు
  • నూనె తగినంత
  • నెయ్యి తగినంత
  • పోపు పెట్టుకోవడానికి తగినన్ని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు.

తయారీ విధానం

నాలుగు కప్పుల నీటిలో ఒక చెంచా నూనె, ఒక అర చెంచా ఉప్పు వేసి, సేమ్యాను మెత్తగా ఉడికించుకోవాలి.
సేమ్యా ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి. మెత్తగా ఉడికిన సేమ్యాను వార్చుకొని, చల్ల నీరు చల్లి, ఒక పక్కకు పెట్టుకోవాలి.
ఒక బాణెలిలో రెండు చెంచాల నూనె వేసుకొని, కొంచం వేడి కాగానే ఆవాలు వేసి, చిట పటలాడనిచ్చుకోవాలి.
దీనికి మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసుకొని, చక్కగా వేగనివ్వాలి. దీనికి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం కోరు తగిలించి వేగనివ్వాలి.
ఇప్పుడు దీనికి మామిడికాయ కోరు కలుపుకొని రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి. దీనికి తగినంత ఉప్పు వేసి (సేమ్యాలో ఒక సారి వేసుకున్న విషయం మర్చిపోవద్దు సుమా!) కలుపుకోవాలి.
దీనిలో సేమ్యా వేసుకొని, మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఎక్కడా ముద్దలు కాకుండా చూసుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఉప్పు సరి చూసుకోండి, అంతే పుల్ల పుల్లని మామిడి సేమ్య ఉప్మా తయార్!

కాజు పకోడి

Picture  Recipe

కావలసినవి వస్తువులు:

  • జీడిపప్పులు - 150 గ్రా.
  • శనగపిండి - 100 గ్రా.
  • బియ్యప్పిండి - 50 గ్రా.
  • కారం - టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి - 6
  • జీలకరప్రొడి - టీ స్పూను
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నూనె - వేయించడానికి తగినంత
  • ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పచ్చిమిర్చి తరుగు, తగినంత నీరు జీలకరప్రొడి, కరివేపాకు, ఉప్పు వేసి పకోడీల పిండి మాదిరిగా కలుపుకోవాలి.
తరవాత జీడిపప్పులను కూడా వేసి మరోమారు కలపాలి.
స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత పకోడీలుగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.

వెజ్ చోప్సి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • నూడుల్స్ - ఒక ప్యాకెట్
  • కేరట్ - 3 సన్నగా పొడుగు తరిగిన ముక్కలు
  • బీన్స్ : ఇరవై - చిన్న చిన్న ముక్కలు తరగాలి
  • కాబేజీ : ఒక చిన్న ముక్క, సన్నగా తరగాలి
  • అల్లం: ఒక చిన్న ముక్క, సన్నగా , చిన్న చిన్న ముక్కలు తరగాలి
  • వెల్లుల్లి: నాలుగు రెబ్బలు , చిన్న చిన్న ముక్కలు తరగాలి
  • ఉల్లిపాయలు: రెండు, సన్నగా , చీలికలుగా తరగాలి
  • కార్న్ ఫ్లోర్ : రెండు టేబుల్ స్పూన్లు
  • నూనె: వేయించటానికి సరిపడా
  • మిరియాల పొడి : అర టీ స్పూను, పొడి చెయ్యాలి
  • అజినమోటో: పావు టీ స్పూను
  • పంచదార: ఒక టీ స్పూను
  • టమాట సాస్: మూడు టేబుల్ స్పూన్లు
  • వేనిగర్ : ఒక టేబుల్ స్పూను
  • ఉప్పు : రుచుకి సరిపడా

తయారీ విధానం

ముందుగా ఒక బాణెలిలో నూడుల్స్ మునిగేలాగ నీరు పోసి , ఆ నీటిలో ఒక స్పూను ఉప్పు , ఒక స్పూను నూనె వేసి బాగా మరగనివ్వాలి.
తరువాత నూడుల్స్ ని ఆ నీటిలో వేసి బాగా ఉడకనివ్వాలి. నూడుల్స్ ఉడికాక వాటి నుండి నీరు తీసేసి ఒక చిల్లుల పళ్ళెంలో వేసి పక్కన పెట్టి బాగా ఆరనివ్వాలి. ఈ వేడి నూడల్సు పై చల్లటి నీరు పోసి వెంటనే చల్లారిస్తే నూడుల్స్ వేడికి అంటుకుపోకుండా ఉంటాయి.
ఇప్పుడు ఒక బాణెలిలో వేయించటానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. బాగా ఆరిన నూడుల్స్ ఒక దోసెడు తీసుకొని ,పక్షి గూడులుగా, చేసి కాగిన నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అలా ఉడకబెట్టిన నూడుల్స్ అన్నిటిని వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక బాణీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో సన్నగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి వేసి వేగనివ్వాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న కేరట్, వేగనివ్వాలి కాబేజీ బాణీలో వేసి కూరలు ఉడికేదాకా వేగనివ్వాలి.
కూరలు కొంచెం ఉడికినా ఇంకా కరకరలాడేలాగే ఉండాలి. ఇప్పుడు మిరియాల పొడి, అజినమోటో, ఉప్పు మరియు పంచదార వెయ్యాలి. తరువాత టమాట సాస్ మరియు వెనిగర్ కూడా వెయ్యాలి. ఇప్పుడు రెండు గ్లాసుల నీరు పోసి బాగా ఉడకనివ్వాలి( కూరలు ఉడక పెట్టినప్పుడు వచ్చిన నీరు ఉన్నా పొయ్యవచ్చు) .
రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని , దానిలో సరిపడా నీరు పోసి ఆ కార్న్ ఫ్లోర్ నీటిని బాణిలో ఉడుకుతున్న మిశ్రమం లో పోసి బాగా కలపాలి. సాస్ లాగా చిక్కపడేవరకు గ్యాస్ మీద ఉంచాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో వేయించి పెట్టుకున్న నూడుల్స్ ముందుగా పెట్టి దానిమీద ఇందాక తయారుచేసిన సాస్ వేడి వేడిగా పోసి సర్వ్ చెయ్యాలి. చోప్సీ రెడీ......

రవ్వ దోసె

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • రెండు కప్పుల రవ్వ (ఉప్మా రవ్వ, లేక బొంబాయి రవ్వ)
  • అర కప్పు మైదా (వద్దనుకున్నవారు గోధుమపిండి వాడవచ్చు)
  • అర కప్పు బియ్యం పిండి
  • ౧ లేదా ౨ పచ్చిమిరపకాయలు (సన్నగా తరిగిన ముక్కలు)
  • కోరిన అల్లం - ఒక చెంచాడు
  • జీలకర్ర - ఒక చెంచాడు
  • మిరియాలు - ఒక చెంచాడు
  • ఉప్పు తగినంత
  • నీళ్ళు - షుమారుగా ఆరు కప్పులు
  • దోసె వేసుకోవడానికి నూనె

తయారీ విధానం

పైన అన్ని పదార్ధాలను చక్కగా కలుపుకొని (ఉండలు లేకుండా) దోశె పిండి తయారు చేసుకోవాలి.
దీనిని ఒక ౧౫ నిమిషాలు నానవివ్వాలి. నానిన తర్వాత నీటి శాతం తగ్గుతుంది (రవ్వ పీల్చుకోవడం వల్ల) దీనికి కొంచం నీటిని కలుపుకోవాలి (దోశె పిండి పలచని మజ్జిగ లాగ తయారవ్వాలి).
ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టుకొని, ఒక నిమిషం వేడి సెగమీద ఉంచుకోని, చల్లని నీరు చిలకరించగానే ఆవిరి అయ్యేంత వేడిగా చూసుకోవాలి.
పెనం అంతా కలిసేట్లు నూనె చెంచాతో నూనె వేసుకోవాలి.
దోశె పిండిని గరిటలో తీసుకొని, పెనం అంతా పల్చగా పరుచుకునేట్లు వేసుకోవాలి (మినప దోసెలను, పింది అంత ఒక చోట వేసి, తిప్పుతూ పరుస్తాం. కాని రవ్వ దోశెలను అలా చెయ్యకూడదు).
ఇక్కడా ఖాళీలు లేకుండా దోశె పోసుకోవాలి.
మధ్యమైన సెగ మీద దోశెని కాల్చుకోవాలి - మెత్తగా ఉండాలంటే కొంచెం త్వరగానూ, బాగా కరకరలడాలంటే కొద్దిగా ఎక్కువ సేపు ఉంచుకోవాలి.
విడిన దోశెను అట్లకాడతో తీసుకోవాలి

మంచూరియా దోశె

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఛాయ మినప్పప్పు... 150 గ్రాములు
  • మెంతులు... 10 గ్రాములు
  • క్యారెట్లు... 1/4కేజీ
  • గ్రీన్ బఠాణీ... 100 గ్రా
  • వెల్లుల్లి... 20 గ్రాములు
  • సోయాసాస్... 2 టీస్పూ//
  • అజినమోటో... 1/4 టీస్పూ//
  • ఉప్పు... సరిపడా
  • ఉప్పుడు బియ్యం... 1/2కేజీ
  • సెనగపప్పు... 50 గ్రా
  • బీన్స్... 150 గ్రా
  • పచ్చిమిర్చి... 20 గ్రా
  • అల్లం... 10 గ్రా
  • చిల్లీసాస్... 1 టీస్పూ//
  • రిఫైన్డ్ ఆయిల్... 50 గ్రా
  • కొత్తిమీర... 1 కట్ట
  • కార్న్‌ఫ్లోర్... తగినంత

తయారీ విధానం

మినప్పప్పు, బియ్యం, మెంతులు, సెనగపప్పును నానబెట్టాలి. ఆపైన మెత్తగా రుబ్బుకుని ఐదు గంటలసేపు పులియబెట్టాలి.
తరువాత క్యారెట్, బీన్స్‌లను సన్నగా తరిగి, నీళ్ళలో ఉడికించి, వార్చి విడిగా ఉంచుకోవాలి.
ఇప్పుడు ఒక బాణెలిలో నూనె పోసి కాగిన తరువాత ముందు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి.
తరువాత ఉడికించిన బీన్స్, క్యారెట్ వేసి కలిపాక, సోయాసాస్, అజినమోటో, చిల్లీసాస్, గ్రీన్ బఠాణీ వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి.
అందులోనే కార్న్‌ఫ్లోర్ కలిపిన నీళ్ళు పోసి చిక్కబడ్డాక, సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వెయ్యాలి.

పొటాటో బ్రెడ్ రోల్స్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బంగాళాదుంపలు. 1/4 కేజీ
  • బ్రెడ్ స్లైసులు... 12
  • అల్లం ముక్కలు.. 1 టీస్పూ//
  • దానిమ్మగింజల పొడి... 1/2 టీస్పూ//
  • మసాలాదినుసుల పొడి.. 1 టీస్పూ //
  • పచ్చిమిర్చి ముక్కలు... 2 టీస్పూ//
  • ధనియాలపొడి... 1/2 టీస్పూన్
  • మిరియాలపొడి... 1/2 టీస్పూ//
  • కొత్తిమీర తరుగు... సరిపడా

తయారీ విధానం

ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, పొట్టుతీసి బాగా నలిపి ఉంచుకోవాలి.
దీనిని ఒక బౌల్‌‌లో వేసి కారం, ఉప్పు, ధనియాలపొడి, పచ్చి మిర్చి, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, గరంమసాలాలు వేసి పేస్టులాగా చేసుకోవాలి.
తరువాత రెండు బ్రెడ్ స్లయిసెస్‌ చొప్పున నీటిలో ముంచి అరనిమిషం తర్వాత తీసి... ఒక దానిమీద బంగాళదుంప పేస్టును సమానంగా సర్ది పైన ఇంకోదాన్ని కవర్ చేసి రెండింటిని కలిపి రోల్ చెయ్యాలి.
ఇలా మొత్తం అన్ని స్లైసులను చేసుకున్న తరువాత బాగా కాగుతున్న నూనెలో వేసి, ఎర్రగా వేయించి తీసేయాలి.
వీటిని టమోటో సాస్‌తో కలిపి తింటే, మంచి రుచిగా ఉంటాయి.

చీజ్ పొటాటో చిప్స్

Picture  Recipe

 

కావలసిన పదార్థాలు

  • బంగాళాదుంపలు. 5
  • చీజ్. 1 కప్పు
  • కారం. 2 టీస్పూ//
  • నూనె.తగినంత
  • ఉప్పు. సరిపడా

తయారీ విధానం

బంగాళాదుంపలను పల్చగా చిప్స్‌గా తరగాలి. ఉప్పువేసి, కనీసం అరగంటసేపు ఒక పక్కన ఉంచాలి.
చిప్స్‌లో తేమ పూర్తిగా పోయి పొడిగా అయ్యేదాకా ఉంచాలి. ఆ తర్వాత చిప్స్‌పై కారం చల్లాలి.
ఇప్పుడు బాణెలి లో నూనె వేడిచేసి తరిగి ఉంచుకున్న బంగాళాదుంప చిప్స్‌లను వేసి బాగా వేయించాలి.
చిప్స్ బాగా వేడిగా ఉన్నప్పుడే చీజ్‌ను చిప్స్‌పై చల్లి సర్వ్ చేయాలి.
వీటిని వండిన రోజునే తినేయాలి. ఆ తరువాతి రోజుకు నిల్వ ఉండవు.

బంగాళాదుంప గారెలు

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బంగాళాదుంపలు.350 గ్రా
  • సెనగపిండి. 60 గ్రా
  • బియ్యం పిండి. 1 టీస్పూ//
  • ఉప్పు. 2 టీస్పూ//
  • పచ్చిమిర్చి. 5
  • అల్లం. కొంచెం
  • ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఇంగువ,
  • నూనె. తాలింపుకు సరిపడా

తయారీ విధానం

ఉడికించిన బంగాళాదుంపల్లో సెనగ పిండిని చేర్చి, ఆ మిశ్రమానికి ఉప్పు, బియ్యం పిండి, నూనెలో వేయించిన ఆవాలు, పచ్చి మిరప కాయలను కలపాలి.
అలాగే కొత్తిమీర, ఇంగువ, కరివేపాకులను కూడా దానికి చేర్చి ముద్దలా చేసుకోవాలి.
ఆ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లాగా కాగుతున్న నూనెలో బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి.
అంతే బంగాళాదుంపలతో గారెలు సిద్ధమైనట్లే.

సింగపూర్ స్టయిల్ నూడిల్స్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఎగ్ నూడిల్స్ 300గ్రా (ఉడికించి వడకట్టాలి. పాకేట్ పై సూచనలు పాటించాలి)
  • బీన్స్,క్యారెట్, గ్రీన్పీస్,కార్న్ 75 గ్రా
  • నూనె 2 టీస్పూ//.
  • ఉల్లిపాయ 1
  • వెల్లుల్లి ముక్కలు 1 టీస్పూ//.
  • సోయా సాస్ 3 టీస్పూ//.
  • చిల్లీ సాస్ 2 టీస్పూ//.
  • పంచదార 1 టీస్పూ//.
  • పాలకూర 50 గ్రా
  • ఉల్లికాడలు 4
  • పాక్చోయ్ ఆకులు (pak choy) తరిగినవి
  • రైస్ వెనీగర్ 1టీస్పూ//.
  • గుడ్డు (egg) 2
  • ఉప్పు తగినంత

తయారీ విధానం

బానేలి లో 1 టీస్పూ// ఊనె వేసి వేడి చేసి,గిలకొట్టిన ఎగ్స్ వేసి దీనిని ఒక ధిక్ షీటుపైన పరచాలి.
దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఓ పక్కన వుంచుకోవాలి.
బాణెలి లో నూనె వేడి చేసి ఒక నిముషం పాటు వెల్లుల్లి వేయించాలి. తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి మరో నిముషం వేయించాలి.
బీన్స్,క్యారేట్, గ్రీన్పీస్,కార్న్. వేసి వుడికించాలి. Non Veg వాళ్ళు ఇక్కడ చికెన్, రొయ్యలు వేసి ఉడికించుకోవచ్చు.
సోయాసాస్, వెనీగర్, చిల్లీసాస్, పంచదార కలపాలి. 3 నిముషాలు సన్నటి సెగపై వుంచి పాలకూర, పాక్చోయ్, ఉప్పు, ఉల్లికాడలు వేసి నూడిల్స్ కలిపి రెండు మూడు నిముషాలు ఉడికించాలి.
ఎగ్ ముక్కల్ని కలియబెట్టాలి. సింగపూర్ స్టయిల్ నూడిల్స్ తయార్.

సేవ్ పూరి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కరకరలాడే చిన్న పూరీలు 10
  • ఉల్లిపాయ 1
  • ఉడికించిన బంగాళాదుంపలు 2
  • పెరుగు 1 cup
  • చింతపండు పులుసు 4 టీస్పూ//.
  • పుదీనా చట్నీ 4టీస్పూ//.
  • చాట్ మసాలా 4 టీస్పూ//.
  • జీలకర్ర పొడి 3 టీస్పూ//.
  • కారం పొడి 2 టీస్పూ//.
  • ఉపు తగినంత
  • సన్నని కారప్పూస 1 కప్పు

తయారీ విధానం

వెడల్పాటి పళ్ళెంలో పూరీలను పరచి పెట్టాలి. పూరి మధ్యలో రంధ్రం చేసి ఉడికించిన బంగాళదుంప పొడి కొంచం పెట్టాలి. దానిపై చింతపండు చట్ని, పుదీనా చట్నీ కొద్ది కొద్దిగా వేయాలి.
తరువాత కారం పొడి, జీలకర్ర పొడి,చాట్ మసాలా పొడులు,ఉప్పు చల్లాలి.
చిలికిన పెరుగు అన్ని పూరీలలో పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,కారప్పూస చల్లి కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.

మ్యాంగో ఫ్రైడ్‌రైస్


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పొడి పొడిగా వండిన అన్నం. 6 కప్పులు
  • మామిడి తురుము, 2 కప్పులు
  • కొబ్బరి తురుము.. 2 కప్పులు
  • మొలకెత్తిన పెసళ్లు. 2 కప్పులు
  • క్యారెట్ తరుగు. 2 కప్పులు
  • క్యాప్సికమ్ తరుగు. 2 కప్పులు
  • మినప్పప్పు, 4 టీస్పూ//
  • నువ్వులు. 4 టీస్పూ//
  • జీడిపప్పు.. 100 గ్రా.
  • శెనగపప్పు, 2 టీస్పూ//
  • మినప్పప్పు. 2 టీస్పూ//
  • కొత్తిమీర తరుగు.. 4 టీస్పూ//
  • ఆవాలు, 2 టీస్పూ//
  • జీలకర్ర, 2 టీస్పూ//
  • పసుపు.. 2 టీస్పూ//
  • పచ్చిమిర్చి. 10
  • పసుపు. 2 టీస్పూ//
  • నూనె, తగినంత
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

ముందుగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి ఉంచుకోవాలి.
పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి.
తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచాలి.
ఇప్పుడు బాణెలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి. అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి.
ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి.
చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి.
అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్‌రైస్ తయార్.

వెల్లుల్లి వంకాయ వేపుడు

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • లేతవంకాయలు. 1/4 కేజీ
  • వెల్లుల్లి కారం. 2 టీస్పూ//
  • నూనె.1 కప్పు
  • ఉప్పు. తగినంత

తయారీ విధానం

ముందుగా వంకాయలను పొడవుగా కట్ చేసి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
స్టౌమీద బాణెలి పెట్టి నూనె వేడయ్యాక పొడవుగా కట్ చేసిన వంకాయలను వేసి నాలుగు నిమిషాల పాటు బాగా వేయించాలి.
తరువాత వెల్లుల్లి కారం వేసి మరికాసేపు వేయించాలి. వంకాయలు దోరగా వేగి, మంచి వాసన వస్తుండగా. ఒక ప్లేటులోకి తీసుకుని. వేడి వేడి వైట్‌రైస్‌తో కలిపి తింటే అద్భుతమైన రుచి.

వెజిటబుల్స్‌తో అట్టు

కావలసిన పదార్థాలు

  • పెసరపప్పు. 150 గ్రా
  • మినపప్పు. 150 గ్రా
  • కందిపప్పు. 150 గ్రా
  • బియ్యము. 150 గ్రా
  • ఆలుగడ్డలు. 2
  • ఉల్లి గడ్డ. 1
  • క్యాబేజీ. తరుగు 1 కప్పు
  • పచ్చిమిర్చి. తరుగు 1/2 కప్పు
  • జీలకర్ర. 2 టీస్పూ//
  • కొత్తిమీర. తరుగు 1 కప్పు
  • నూనె. కొద్దిగా
  • ఉప్పు. సరిపడా

తయారీ విధానం

పెసర, మినప, కంది, శెనగ పప్పులను గంటసేపు నానెబెట్టి రుబ్బుకోవాలి.
ఈ పిండిలో ఉల్లిగడ్డ, క్యాబేజీ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగుల్ని చేర్చుకోవాలి.
ఈ మిశ్రమం ఇడ్లీ పిండిలా తయారైన తర్వాత. కొద్ది కొద్దిగా తీసుకుని పెనం మీద దోసెలుగా పోసి ఎర్రగా కాలిన తర్వాత దించేయాలి.
అంతే వెజిటబుల్స్‌తో తయారైన అట్టు సిద్ధమైనట్లే..! దీన్ని వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఛీజ్‌తో గార్లిక్ టోస్ట్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బ్రెడ్ స్లైసులు. 2
  • వెల్లుల్లి పేస్ట్. 1 టీస్పూ//
  • ఉప్పు. తగినంత
  • మిరియాలపొడి. 1 టీస్పూ//
  • వెన్న. 2 టీస్పూ//
  • ఛీజ్ ముక్కలు. 1/4 కప్పు
  • పచ్చిమిర్చి తరుగు. 2 కాయలవి
  • ఉల్లిపాయ తరుగు. 1 టీస్పూ//

తయారీ విధానం

వెన్న, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పులను ఒక పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులకు రెండువైపులా పూయాలి.
ఇప్పుడు ఛీజ్ ముక్కలు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగులను మిక్స్ చేసి బ్రెడ్ స్లైసులపై చల్లాలి.
స్టవ్‌పై పెనం పెట్టి, కాస్తంత వెన్న వేసి బ్రెడ్ స్లైసులను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఛీజ్‌తో గార్లిక్ టోస్ట్ రెడీ అయినట్లే.
వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే, టమోటో సాస్‌తోగానీ, చిల్లీ సాస్‌తోగానీ కలిపి తింటే, చాలా రుచిగా ఉంటాయి.

అల్లం మిర్చి పెసరట్టు

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పెసరపప్పు. 1/4 కేజీ
  • అల్లం ముక్క. పెద్దది
  • పచ్చిమిర్చి తరుగు. 1/2 కప్పు
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • ఉప్పు. 1/2 టీస్పూ//.
  • కొత్తిమీర తరుగు. 1/2 కప్పు
  • వంటసోడా. చిటికెడు
  • నూనె. అట్లు కాలడానికి సరిపడా

తయారీ విధానం

ముందుగా పొట్టు తీయని పెసరపప్పును రెండు గంటలసేపు నానబెట్టి, రుబ్బి ఉంచుకోవాలి.
కాస్త చిక్కగా ఉండే ఈ పెసరపప్పు పిండిలో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులను, సరిపడా ఉప్పు, చిటికెడు వంటసోడాను వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి, వేడయ్యాక గరిటెడు పెసరట్టు పిండిని తీసుకుని దోసెలాగా పోసి, ఉల్లిపాయ తరుగును చల్లాలి.
తరువాత సరిపడా నూనెను అట్టుపైన, అంచుల్లోనూ స్పూన్‌తో వేయాలి. సన్నని మంటమీద అట్టును రెండువైపులా కాల్చి తీసేయాలి.
వీటిని వేడి, వేడిగా ఉన్నప్పుడే గ్రీన్ చట్నీ లేదా పల్లీల పచ్చడితో కలిపి తింటే...మంచి రుచితో మిమ్మల్ని అలరిస్తాయి.

పాలకూర మైదా గ్రీన్ పౌచ్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మైదా. 1 కప్పు
  • పాలకూర. 1 కప్పు
  • తోటకూర. 1 కప్పు
  • పనీర్. 1/2 కప్పు
  • వెన్న. 2 టీస్పూ//
  • ఉప్పు. తగినంత
  • కారం. తగినంత
  • జీలకర్ర పొడి. 1/2 టీస్పూ//
  • నూనె. 2 టీస్పూన్లు

తయారీ విధానం

మైదాపిండిలో చిటికెడు ఉప్పు, నూనె కలిపి తగినంత నీటితో ముద్దలాగా చేసుకోవాలి.
ఈ ముద్దను అరగంటసేపు నానబెట్టాలి. ఈలోపు పాలకూర, తోటకూరలను శుభ్రం చేసుకుని. సన్నగా తరిగాలి.
అలాగే పనీర్‌ను కూడా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణెలి లో వెన్న వేసి వేడయిన తరువాత ఆకుకూరను వేసి వేయించాలి.
ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పనీర్ తురుమును కూడా అందులో వేసి ఐదు నిమిషాలపాటు వేయించి, దించేయాలి.
మైదా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పూరీ కన్నా కాస్తంత మందంగా ఒత్తుకోవాలి.
పైన వేయించి ఉంచుకున్న ఆకుకూరల మిశ్రమాన్ని ఈ పూరీల మధ్యలో ఉంచి కొసలను మూసేయాలి.
మొత్తం పిండినంతా అలా చేసుకున్న తరువాత వాటిని ఓవెన్‌లో పదిహేను నిమిషాల పాటు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి.
ఓవెన్లో వద్దనుకునేవారు నూనెలో కూడా వీటిని వేయించుకోవచ్చు. అంతే. పాలకూర మైదా గ్రీన్ పౌచ్ రెడీ అయినట్లే.

న్యూడిల్స్ ఇడ్లీలు

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • ఇడ్లీ రవ్వ. 3 కప్పులు
  • ఉప్పు. సరిపడా
  • కరివేపాకు. కొద్దిగా
  • ఎండుమిర్చి.4
  • ఉడకబెట్టిన న్యూడిల్స్. 1 కప్పు
  • ఆవాలు. 1 టీస్పూ//
  • నూనె. 2 టీస్పూ//

తయారీ విధానం

ఇడ్లీ రవ్వ, ఉడకబెట్టిన నూడుల్స్, ఉప్పులను ఒక పాత్రలోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి.
ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో పోసి ఇడ్లీ పాత్ర లేదా ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఆవిరిమీద సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత నూనె వేడిచేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇడ్లీలు ఉడికిన తరువాత దించి హాట్‌ప్యాక్‌లో వేసేముందు ఇడ్లీలమీద పైన తయారు చేసిన పోపును చల్లాలి.
అంతే న్యూడిల్స్ ఇడ్లీలు తయారైనట్లే. టమోటో కెచప్ లేదా ఏదేని పచ్చడితో కలిపి వేడి వేడిగా తింటే ఈ న్యూడిల్స్ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి.

దిబ్బరొట్టె

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మినప్పప్పు. 1/2 కేజీ
  • బియ్యం రవ్వ. 1/4కేజీ
  • ఉప్పు. సరిపడా
  • నూనె. తగినంత
  • జీలకర్ర. సరిపడా

తయారీ విధానం

ముందుగా మినప్పప్పును నాలుగు గంటలపాటు నానబెట్టి, మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి.
బియ్యం రవ్వను నీటిలో రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత రవ్వలో ఉన్న నీటిని ఒంపేసి, మినప్పిండిలో రవ్వను కలుపుకోవాలి.
పై మిశ్రమానికి ఉప్పు కలిపి కొద్దిసేపు పిండిని అలాగే ఉంచేయాలి. మందపాటి పెనంపై నూనె వేసి, పిండిని మందంగా పరిచి, సన్నని సెగపై మూతపెట్టి కాలనివ్వాలి.
ఉడికాక రెండో వైపునకు తిప్పి కొద్ది నిమిషాలు ఉంచాలి. వేడి వేడిగా ఇష్టమైన పచ్చడితో తింటే రుచితో ఉంటాయి.

క్యారెట్ బట్టూరా

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మైదాపిండి. 4 కప్పులు
  • వంట సోడా. 1/2 టీస్పూన్
  • పులిసిన పెరుగు. 1.1/2 కప్పు
  • క్యారెట్ తురుము. 2 కప్పులు
  • నెయ్యి. తగినంత
  • నూనె, ఉప్పు. తగినంత

తయారీ విధానం

ముందుగా పెరుగులో వంటసోడా, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి.
కాసేపటి తరువాత పెరుగు మిశ్రమంలో మైదా పిండి, క్యారెట్ తురుము వేసి బాగా కలిపి, చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు పై పిండిని తడిగుడ్డతో మూసి, సుమారు ఐదారు గంటలపాటు అలాగే ఉంచేయాలి.
ఆ తరువాత తడిగుడ్డను తీసివేసి, పిండిని మళ్లీ మెత్తగా చేసుకుని, కొద్ది కొద్దిగా తీసి చపాతీల్లాగా చేసుకోవాలి.
ఇలా చేసుకున్న వాటిని పెనం వేడిచేసి నెయ్యి, లేదా నూనె వేస్తూ... రెండువైపులా బంగారు వర్ణం వచ్చేలా కాల్చి తీసేయాలి.
అంతే క్యారెట్ బట్టూరా తయారైనట్లే.. వీటిని ఏదైనా పప్పుతో తయారైన వేడి వేడి కూరతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.