కావలసిన పదార్థాలు
- పొడి పొడిగా వండిన అన్నం. 6 కప్పులు
- మామిడి తురుము, 2 కప్పులు
- కొబ్బరి తురుము.. 2 కప్పులు
- మొలకెత్తిన పెసళ్లు. 2 కప్పులు
- క్యారెట్ తరుగు. 2 కప్పులు
- క్యాప్సికమ్ తరుగు. 2 కప్పులు
- మినప్పప్పు, 4 టీస్పూ//
- నువ్వులు. 4 టీస్పూ//
- జీడిపప్పు.. 100 గ్రా.
- శెనగపప్పు, 2 టీస్పూ//
- మినప్పప్పు. 2 టీస్పూ//
- కొత్తిమీర తరుగు.. 4 టీస్పూ//
- ఆవాలు, 2 టీస్పూ//
- జీలకర్ర, 2 టీస్పూ//
- పసుపు.. 2 టీస్పూ//
- పచ్చిమిర్చి. 10
- పసుపు. 2 టీస్పూ//
- నూనె, తగినంత
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
ముందుగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి ఉంచుకోవాలి.
పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి.
తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచాలి.
ఇప్పుడు బాణెలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు,
శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా
వేయించాలి. అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు
వేయించాలి.
ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి.
చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి.
అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్‌రైస్ తయార్.
No comments:
Post a Comment