కావలసిన పదార్థాలు
- కరకరలాడే చిన్న పూరీలు 10
- ఉల్లిపాయ 1
- ఉడికించిన బంగాళాదుంపలు 2
- పెరుగు 1 cup
- చింతపండు పులుసు 4 టీస్పూ//.
- పుదీనా చట్నీ 4టీస్పూ//.
- చాట్ మసాలా 4 టీస్పూ//.
- జీలకర్ర పొడి 3 టీస్పూ//.
- కారం పొడి 2 టీస్పూ//.
- ఉపు తగినంత
- సన్నని కారప్పూస 1 కప్పు
తయారీ విధానం
వెడల్పాటి పళ్ళెంలో పూరీలను పరచి పెట్టాలి. పూరి
మధ్యలో రంధ్రం చేసి ఉడికించిన బంగాళదుంప పొడి కొంచం పెట్టాలి. దానిపై
చింతపండు చట్ని, పుదీనా చట్నీ కొద్ది కొద్దిగా వేయాలి.
తరువాత కారం పొడి, జీలకర్ర పొడి,చాట్ మసాలా పొడులు,ఉప్పు చల్లాలి.
చిలికిన పెరుగు అన్ని పూరీలలో పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,కారప్పూస చల్లి కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.
No comments:
Post a Comment