కావలసిన పదార్థాలు
- లేత బెండకాయలు. 1/2 కేజీ
- పనీర్. 2 కప్పులు
- టొమోటోలు. 2
- కారం. 1 టీస్పూ//.
- జీలకర్ర. 1 టీస్పూ//.
- నూనె. 6 టీస్పూ//.
- ఉప్పు. సరిపడా
- కొత్తిమీర. కొద్దిగా
తయారీ విధానం
బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక మంచి గుడ్డతో తుడవాలి. వాటికి మొదలు, చివర్లను కట్ చేసి, గాట్లను పెట్టాలి.
ఒక బాణెలి లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక టొమోటో గుజ్జు, కారం, జీలకర్ర, ఉప్పు, పనీర్ ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి.
అన్ని పదార్థాలను రెండు నిమిషాలు వేయించి దించేయాలి. గాట్లు పెట్టిన బెండకాయల్లో పై మిశ్రమాన్ని నింపాలి.
అడుగు మందంగా ఉండే మరో పాన్‌లో మిగతా నూనె వేసి
వేడయ్యాక స్టఫ్డ్ బెండకాయల్ని వేసి మూతపెట్టి, సన్నటి మంటమీద పదిహేను
నిమిషాలపాటు వేయించాలి.
మాడకుండా జాగ్రత్తపడుతూ వేయించి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే పనీర్ స్టఫ్డ్ బెండీ సిద్ధమైనట్లే.
No comments:
Post a Comment