కావలసిన పదార్ధాలు:
- బీట్రూట్ ముక్కలు: 1 చిన్న కప్పు
- ఉడికించినది కంది పప్పు: 2 కప్పులు
- ఉడికించినది చిక్కటి చింతపండు పులుసు: 1 కప్పు
- నీరు: 2 కప్పులు
- ఉప్పు: తగినంత
- పోపుకి :ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తగినంత
కూటు తయారికి:
- ధనియాలు:1 టీస్పూ//
- శనగపప్పు: ½ టీస్పూ//
- మినపప్పు:1/4 టీస్పూ//
- ఎండు మిరపకాయలు: 4
- ఎండు కొబ్బరి: 1 టీస్పూ//
- ఇంగువ: చిటికెదు
- నూనె: ¼ టీస్పూ//
తయారి విధానం:
ముందుగా బాణెలిలో కొంచెం నూనె వేసి కూటు తయారీకి
కావలసిన పదార్ధాలన్ని వేసుకుని దోరగ వేయించుకుని, బాగ మెత్తగా పేస్ట్
చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా వుంటే కూటు అంత బాగుంటుంది.
తరువాత మూకుడులో కొంచెం నూనె వేసి పోపు వేసి
వేయించుకున్నాక, ఉడికించిన బీట్రూట్ ముక్కలు, చింతపండు పులుసు పోసుకుని
దానికి నీరు కలిపి తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి.
ఇది బాగ కళ పెళ ఉడుకుతున్నప్పుడు పైన రుబ్బుకున్న కూటు కలిపి ఉడకనివ్వాలి.
ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఉడికించుకున్న కంది పప్పు కూడ కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
No comments:
Post a Comment