కావలసిన పదార్థాలు:
- అరటికాయలు. 2
- ఉల్లిపాయలు. 4
- పచ్చిమిర్చి. 10
- కొత్తిమీర. 1 కట్ట
- ఉప్పు. సరిపడా
- నూనె. 2 టీస్పూ//.
- జీలకర్ర. 1 టీస్పూ//.
- ఆవాలు. 1 టీస్పూ//.
- సెనగపప్పు. 2 టీస్పూ//.
- వెల్లుల్లి. 6 రేకలు
తయారు చేయు విధానము :
వెల్లుల్లి మెత్తగా నూరాలి. అరటికాయల తొక్కు తీసి గుండ్రంగా ముక్కలుగా కోసి ఉడికించాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా
కోయాలి. బాణెలిలో నూనె పోసి తాలింపు చేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి
బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.
తరువాత పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన అరటిముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి.
ఆపై మెత్తగా నూరిన వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా కలియబెట్టి, కొంచెం నీరు పోసి దగ్గరగా ఉడికించాలి.
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే అరటికాయ కూర రెడీ.
No comments:
Post a Comment