కావలసిన పదార్థాలు
- ఆవ ఆకులు. 1/4 కేజీ
- పాలకూర. 100 గ్రా
- ఉల్లిపాయలు. 25 గ్రా.
- ముల్లంగి. 2
- వెల్లుల్లి. 5 రెబ్బలు
- అల్లం. చిన్న ముక్క
- పచ్చిమిర్చి. 2
- ఉప్పు. తగినంత
- పోపు కోసం.
- అల్లం. చిన్న ముక్క
- పచ్చిమిర్చి. 2
- నెయ్యి లేదా నూనె. 2 టీస్పూ//.
- కారంపొడి. 1/2 టీస్పూ//.
తయారీ విధానం
ఆవ ఆకులను, పాలకూరను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి, చల్లార్చి... మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి.
అల్లం, వెల్లుల్లిపాయలను కలిపి మెత్తగా గ్రైండ్
చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి అందులో అల్లం,
వెల్లుల్లి, ఉల్లిపాయల పేస్టు వేసి దోరగా వేయించాలి.
తరువాత ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న ఆవకూర మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి.
చివర్లో పైన చెప్పుకున్న పోపు సామానులతో పోపుపెట్టి ఆవకూరకు కలపాలి. అంతే రుచికరమైన సార్సన్ కా సాగ్ తయారైనట్లే.
No comments:
Post a Comment