Showing posts with label ఉరగాయలు. Show all posts
Showing posts with label ఉరగాయలు. Show all posts

Tuesday, May 8, 2012

చిక్కుడు ఊరగాయ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • చిక్కుడుకాయ ముక్కలు. 2 కప్పులు
  • చింతపండుగుజ్జు. 1 కప్పు
  • కారం. 1/2 కప్పు
  • నూనె. 1 కప్పు
  • ఉప్పు. 1/4 కప్పు
  • మెంతులు. 4 టీస్పూ//.
  • పసుపు. 1 టీస్పూ//.
  • మినప్పప్పు. 1 టీస్పూ//.
  • సెనగపప్పు. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 2 రెబ్బలు
  • వెల్లుల్లిపాయలు. 2
  • ఆవాలు. 4 టీస్పూ//.

తయారీ విధానం

చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడిగి పొడిబట్టమీద ఆరనివ్వాలి. చింతపండు గుజ్జుని ఓ బాణెలిలో వేసి ఉడికించాలి.
మరో బాణెలిలో సగం నూనె పోసి ఆరిన చిక్కుడుకాయల ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని చింతపండు గుజ్జులో వేయాలి.
ఇప్పుడు మిగిలిన నూనె కూడా బాణెలిలో పోసి పోపు సామాను అంతా వేసి ఎర్రగా వేయించాలి.
అందులోనే పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత కారం, కరివేపాకు వేసి అన్నింటినీ చింతపండు గుజ్జులో వెయ్యాలి.
ఉప్పు, పసుపు కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి పొడిగా ఉన్న సీసాలో పెట్టుకోవాలి. ఒక రోజు ఊరితే బాగుంటుంది. అంతే చిక్కుడు ఊరగాయ రెడీ .

పులిహోర ఆవకాయ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడికాయలు. 6
  • కారం. ½ కేజి
  • ఆవాలు 25 గ్రా.
  • వేయించిన మెంతి పొడి 50 గ్రా.
  • వేయించిన ఆవాల పొడి 1 టీస్పూ//.
  • ఉప్పు తగినంత
  • పసుపు. తగినంత.
  • మెంతులు 1 టీస్పూ//.
  • ఇంగువ ½ టీస్పూ//.
  • మిరపకాయలు 50 గ్రా.
  • శనగపప్పు 50 గ్రా.
  • మినప్పప్పు. 50 గ్రా.
  • నూనె తగినంత

తయారీ విధానం

ముందుగా మామిడికాయలను చెక్కుతీసి తురిమి పక్కనుంచాలి.
తరువాత నూనె కాచి అందులో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, శనగపప్పు, ఇంగువ, మినప్పప్పు, మెంతిపొడి, ఆవాలపొడి, తగినంత ఉప్పు, పసుపు, కారంపొడి వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జాడీలో వేసి... దానిపై మామిడి తురుమును వేసి కారం తురుముకు కలిసేలాగా చేసి నిల్వ చేసుకోవాలి.

మామిడి పిందెల ఊరగాయ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడి పిందెలు : మూడు కప్పులు
  • కారం. 1/2 కప్పు
  • ఆవపిండి. 1/4 కప్పు
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • ఇంగువ. 1/2 టీస్పూ//.
  • సిట్రిక్ యాసిడ్. 1/2 టీస్పూ//.

తయారీ విధానం

మామిడిపిందెలని కడిగి నీడలో ఆరనివ్వాలి. తరవాత కాయలకు ఉప్పు, పసుపు పట్టించి ఓ ప్లాస్టిక్‌ డబ్బా లేదా జాడీలో పెట్టి మూతపెట్టాలి.
ఇలా వీటిని నాలుగురోజులు ఉంచాలి. కారం, సిట్రిక్‌ యాసిడ్‌, ఆవపిండి, ఇంగువ. అన్నింటినీ విడిగా కలిపి ఉంచాలి.
నాలుగురోజుల తరవాత ఈ కారం మిశ్రమాన్ని కాయలున్న జాడీలో వేసి బాగా కలిపితే మామిడి పిందెల ఊరగాయ రెడీ.!

ద్రాక్ష ఆవకాయ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పుల్లటి ద్రాక్ష కాయలు.. 1 కేజీ
  • ఆవాలపొడి 2 టీస్పూ//
  • కారం 4 టీస్పూ//
  • ఉప్పు 2 టీస్పూ//
  • జీలకర్ర పొడి 2 టీస్పూ//
  • వెల్లుల్లి రేకలు 1 పాయ మొత్తం
  • నూనె తగినంత

తయారీ విధానం

ద్రాక్ష కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి.
బాగా ఆరిన తరువాత నిలువుగా రెండు ముక్కలుగా ద్రాక్షకాయలను కోసుకోవాలి.
ఒక గిన్నెలో ఆవపొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.
ఈ మిశ్రమంలో ద్రాక్ష ముక్కలతోపాటు సరిపడా కాచిన నూనె పోసి బాగా కలియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో వేసి మూతపెట్టి ఉంచాలి.
మూడు రోజులు బాగా ఊరిన తరువాత, ఈ మిశ్రమంలో ఊట వచ్చి పుల్లగా ఉండే ద్రాక్ష ఆవకాయ తయారవుతుంది.
దీనిని కావల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పాత్రలోకి తీసుకుని అలాగే అయినా లేదా పోపు పెట్టుకుని అయినా అన్నం, ఇడ్లీ, చపాతీ లాంటి వాటిలో నంజుకుని తినవచ్చు. 

గుజరాతీ ఆవకాయ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పచ్చిమామిడి కాయలు (రాజపురి రకం ) 1 కేజీ
  • మెంతులు 1 కప్పు
  • ఉప్పు 1 ½ కప్పు
  • కాశ్మీరీ కారం 1 ½ కప్పు
  • ఆవపిండి 2 టీస్పూ//
  • ఇంగువ 2 టీస్పూ//
  • నువ్వుల నూనె తగినంత

తయారీ విధానం

మామిడికాయల్ని కడిగి ఆరనివ్వాలి.
వాటిని అంగుళం సైజు ఆవకాయముక్కల మాదిరిగా కోయాలి. ముక్కలని కాసేపు ఎండనివ్వాలి.
ఒక కప్పు నువ్వుల నూనెను మరిగించాలి. అందులో మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ వేసి, బాగా కలిపి, ఓ పెద్ద స్టీలు గిన్నెలోకి మార్చాలి.
ఇప్పుడు పై మిశ్రమంలో ఆవకాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
చివరగా ఓ పలుచని బట్టతో దీని మూతిని బిగించి కట్టాలి.
రెండు రోజుల తరువాత మరో రెండు కప్పుల నువ్వుల నూనెను వేయాలి. ఆపై దాన్ని జాడీలోకి మార్చుకోవాలి.
పచ్చడిమీద నూనె అంగుళం ఎత్తున తేలుతూ ఉండేలా చూసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

మామిడి ఊరగాయి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పచ్చిమామిడికాయలు. 2 కేజీలు
  • మెంతిపొడి. 2 టీస్పూ//. .
  • అనాసపువ్వు. 2 టీస్పూ//. .
  • కారం. 150 గ్రా.
  • ఉల్లి విత్తనాలు. 20 గ్రా.
  • జీలకర్ర. 20 గ్రా.
  • ఆవాలు. 20 గ్రా.
  • పసుపు. 20 గ్రా.
  • ఇంగువ. చిటికెడు
  • ఆవనూనె. తగినంత
  • ఉప్పు. సరిపడా

తయారీ విధానం

మామిడికాయల్ని కడిగి చిన్నముక్కలుగా కోసి ఎండలో పెట్టాలి. అనాసపువ్వు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
తరువాత అందులో ఉల్లివిత్తులు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ కలపాలి.
ఇప్పుడు ఈ కారం మిశ్రమంలో ఆవనూనె వేసి కలపాలి. తరువాత ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి.
దీన్ని జాడీలోకి పెట్టి కిటికీకి దగ్గరగా అంటే సూర్యకాంతి నేరుగా తగలకుండా ఉండేచోట 15 రోజులపాటు ఉంచాలి. తరువాత అల్మరాలో పెట్టుకోవచ్చు.
అయితే ఎప్పటికప్పుడు పచ్చడిపైన నూనె ఉందో లేదో చూసుకుంటూ, తగ్గితే కాస్త పోస్తూ ఉండాలి.
అంతే సింధీ ఆమ్‌ కా అచర్‌ సిద్ధమైనట్లే.

బొప్పాయి ఊరగాయ


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పచ్చిబొప్పాయి. పెద్ద కప్పు
  • నూనె. 4 టీస్పూ//.
  • నిమ్మరసం. 2 టీస్పూ//.
  • కారం. 1 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • ఆవపిండి. 1/4 టీస్పూ//.
  • మెంతిపిండి. 1/4 టీస్పూ//.
  • ఇంగువ. చిటికెడు
  • పసుపు. చిటికెడు

తయారీ విధానం

పొడి గిన్నెలో బొప్పాయి ముక్కలు వేసి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నిమ్మరసం, నూనె వేసి అన్నీ బాగా కలపాలి.
ఉప్పు కాస్త ఎక్కువ తినేవారు మరికాస్త వేసుకోవచ్చు.
రెండో రోజుకు ముక్క ఊరి పచ్చడి తినడానికి బాగుంటుంది. ఇష్టమైనవారు ఒక టీస్పూను వెల్లుల్లి తురుము కూడా వేసుకోవచ్చు.
అంతే సింపుల్‌గా తయారయ్యే బొప్పాయి పచ్చడి రెడీ.