కావలసిన పదార్థాలు
- మామిడి పిందెలు : మూడు కప్పులు
- కారం. 1/2 కప్పు
- ఆవపిండి. 1/4 కప్పు
- పసుపు. 1/2 టీస్పూ//.
- ఇంగువ. 1/2 టీస్పూ//.
- సిట్రిక్ యాసిడ్. 1/2 టీస్పూ//.
తయారీ విధానం
మామిడిపిందెలని కడిగి నీడలో ఆరనివ్వాలి. తరవాత కాయలకు ఉప్పు, పసుపు పట్టించి ఓ ప్లాస్టిక్ డబ్బా లేదా జాడీలో పెట్టి మూతపెట్టాలి.
ఇలా వీటిని నాలుగురోజులు ఉంచాలి. కారం, సిట్రిక్ యాసిడ్, ఆవపిండి, ఇంగువ. అన్నింటినీ విడిగా కలిపి ఉంచాలి.
నాలుగురోజుల తరవాత ఈ కారం మిశ్రమాన్ని కాయలున్న జాడీలో వేసి బాగా కలిపితే మామిడి పిందెల ఊరగాయ రెడీ.!
No comments:
Post a Comment