కావలసిన పదార్థాలు
- పచ్చి కందిగింజలు 1 కప్పు
- టొమోటోలు.. 1/4 కేజీ
- మెంతి ఆకు.. 1 కప్పు
- ఉల్లిపాయ.. ఒకటి
- కారం పొడి.. 2 టీస్పూ//
- అల్లం వెల్లుల్లి పేస్టు.. 1/2 టీస్పూ//.
- కరివేపాకు 2 రెమ్మలు
- పసుపు 1/4 టీస్పూ//.
- గరం మసాలా 1/4 టీస్పూ//.
- కొత్తిమీర తురుము 1/2 కప్పు
- ఉప్పు, నూనె.. సరిపడా
- పంచదార.. చిటికెడు
తయారు చేయు విధానం :
బాణిలో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి ఆకు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి.
దీనిలో కంది గింజలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కొంచెం సేపు వేపుకోవాలి.
తర్వాత టొమోటో ముక్కలు, పంచదార వేసి ఉడికించాలి.
సన్నటిమంట మీద కాసేపు ఉంచాక, దించి, తరిగిన కొత్తిమీర వేసుకోవాలి
No comments:
Post a Comment