కావలసిన పదార్థాలు
- పనీర్. 400 గ్రా.
- శెనగపిండి. 1 కప్పు
- నూనె. 2 టీస్పూ//.
- మెంతి ఆకులు. 2 కప్పులు
- మిరియాలపొడి. 1/2టీస్పూ//.
- జీలకర్ర. 1 టీస్పూ//.
- టొమోటో గుజ్జు. 1/2 కప్పు
- నీళ్లు. తగినన్ని
- తాజా మీగడ. 1 టీస్పూ//.
- ఉప్పు. సరిపడా
తయారు చేయు విధానం :
శెనగపిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి, శెనగపిండిలో దొర్లించాలి.
వెడల్పాటి బాణెలి లో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన ఉంచాలి.
ఇప్పుడు అదే బాణెలి లో మిగిలి ఉన్న నూనెలోనే టొమోటో
గుజ్జు, మిరియాలపొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు
పోసి అరగంటసేపు తక్కువ మంటమీద ఉడికించాలి.
తరువాత పనీర్ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి పైన మీగడ వేసి కలిపి వడ్డించాలి.
No comments:
Post a Comment