కావలసిన పదార్థాలు :
- క్యారెట్లు... పావుకేజీ
- మైదా... 50 గ్రాములు
- శెనగపిండి... 50 గ్రాములు
- అల్లం వెల్లుల్లి పేస్ట్... 1 టీస్పూ//
- కారం... 1/4 టీస్పూ//
- పెరుగు... 1 కప్పు
- పచ్చిమిర్చి... 4
- నూనె... సరిపడా
- ఉప్పు... సరిపడా
- కరివేపాకు.... తగినంత
తయారు చేయు విధానం :
అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పెరుగులను ఓ బౌల్‌లో తీసుకుని కొద్దిగా నీరు చేర్చి పకోడీల పిండిలాగా కలుపుకోవాలి.
నూనెను వేడిచేసి కాస్త పొడవుగా తరిగిన క్యారెట్ ముక్కలను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయించి తీసేయాలి.
మరో గిన్నెలో రెండు టీస్పూన్ల నూనెను తీసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
దీనికి క్యారెట్ ముక్కలను కూడా కలిపి సన్నటి మంటమీద బాగా కలుపుతూ వేయించి దించేయాలి. అంతే క్యారెట్ 65 రెడీ అయినట్లే.
No comments:
Post a Comment