కావలసిన పదార్థాలు
- కందిపప్పు. ఒక కప్పు
- అరటిపువ్వు. 1
- చింతపండుగుజ్జు. 1 టీస్పూ//
- జీలకర్ర, 1 టీస్పూ//
- ఆవాలు. 1 టీస్పూ//
- ఇంగువ. చిటికెడు
- ఎండుమిర్చి. 3
- పచ్చిమిర్చి. 3
- కరివేపాకు. 2 రెబ్బలు
- నూనె. 1 టీస్పూ//
- ఉప్పు. తగినంత
- పసుపు. 1/4 టీస్పూ//
తయారీ విధానం
ముందుగా అరటిపువ్వును శుభ్రం చేసుకుని కచ్చాపచ్చాగా దంచి బాగా కడిగి వేడినీటిలో 5 నిమిషాలుంచి నీటిని వంపేసి పక్కనుంచాలి.
ప్రెషర్ కుక్కర్‌లో పప్పు, అరటిపువ్వు మిశ్రమం వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి.
తరువాత అందులోనే కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉడికించిన పప్పు-అరటిపువ్వు మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి.
అందులో చింతపండు గుజ్జు వేసి పదినిమిషాలు ఉడికించి దించేయాలి. దీనిపై తరిగిన కొత్తిమీర జల్లుకోండి.
No comments:
Post a Comment