Thursday, May 10, 2012

పెసరపప్పు రోటీ కర్రీ


కావలసిన పదార్థాలు


  • పెసరపప్పు. 1/2కేజీ
  • బెల్లం తురుము. 2 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. 8
  • పసుపు టీస్పూన్ //
  • కారంపొడి టీస్పూన్ //
  • ఆవాలు టీస్పూన్//
  • జీలకర్ర. టీస్పూ//.
  • ధనియాలపొడి. 2 టీస్పూ//.
  • జీలకర్రపొడి. 2 టీస్పూ//.
  • పెరుగు. 2 కప్పులు
  • అల్లం. కొద్దిగా
  • నూనె తగినంత
  • ఉప్పు. తగినంత
  • ఇంగువ చిటికెడు

తయారీ విధానం


ముందుగా పెసరపప్పును కడిగి గంటసేపు నానబెట్టాలి. ఆ తరువాత నీటిని వంపేసి మళ్లీ 3 కప్పుల నీరు పోసి మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి.

దీంట్లోనే పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, బెల్లంతురుము, ఉప్పు, పెరుగును కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై ఉడికించాలి.

చివరగా. బాణెలిలో నూనె పోసి, వేడయ్యాక తాలింపు గింజలు వేసి, దాంట్లో పెరుగు కలిపి వేడి చేస్తున్న పప్పులో వేసి. ఐదు నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి. అంతే పెసరపప్పు రోటీ కర్రీ రెఢీ

No comments:

Post a Comment