కావలసిన పదార్థాలు :
- గోంగూర... 2 కట్టలు
- ఉల్లిపాయలు... 2
- పచ్చిమిర్చి.... 6
- వెల్లుల్లి రెబ్బలు... 10
- కారం, ఉప్పు... తగినంత
- తాలింపు గింజలు... 2 టీస్పూ//
- నూనె... 1 కప్పు
- ఎండుమిర్చి... 4
తయారు చేయు విధానం :
గోంగూరను శుభ్రంగా కడిగి సన్నగా తరుగుకోవాలి.
ఒక బాణెలిని స్టౌమీద పెట్టి నూనె వేసి, కాగిన
తరువాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి
ముక్కలను వేసి వేయించాలి.
వేగిన తరువాత అందులో గోంగూర, వెల్లుల్లిపాయలను వేసి మూతపెట్టి ఉడికించాలి.
రెండు నిమిషాల తరువాత సరిపడా కారం, ఉప్పు వేసి కలపాలి.
కూర బాగా వేగి నూనె పైకి తేలిన తరువాత తీసి జాడీలో పెట్టుకుంటే.. 15 రోజుల దాకా ఇది నిలువ ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది.
No comments:
Post a Comment