కావలసిన పదార్థాలు
- తాజా మొక్కజొన్నలు... 50 గ్రా
- ఉల్లిపాయ తురుము... 25 గ్రా
- కొత్తిమీర తురుము... 25 గ్రా
- మిర్చిపొడి... 1/2 టీస్పూ//
- గరంమసాలాపొడి... 1/2 టీస్పూ//
- రిఫైన్డ్ ఆయిల్... 1 టీస్పూ//
- తాజా పాలకూర తురుము... 40 గ్రా
- పచ్చిమిర్చి తురుము... 1/2 టీస్పూ//
- అల్లంవెల్లుల్లి తురుము... 2 టీస్పూ//
- ధనియాలపొడి... 1/2 టీస్పూన్
- బటర్... 1 టీస్పూ//
- నిమ్మరసం... 1/2 టీస్పూ//
తయారు చేయు విధానం :
పాలకూర, మొక్కజొన్నలను విడివిడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
బాణెలి లో నూనె, బట్టర్ వేసి వేడయ్యాక... అల్లం, వెల్ల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వరుసగా వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
పాలకూర కూడా అందులో వేసి నిమిషంపాటు ఉడికించిన
తరువాత ఉడికించిన మొక్కజొన్నలను, మిగిలిన మసాలాలను అన్నింటినీ వేసి మరో
రెండు నిమిషాలపాటు ఉడికించాలి.
చివర్లో నిమ్మరసం, కొత్తిమీర తురుము కూర పైన చల్లి వేడి వేడిగా అతిథులకు వడ్డించండి.
No comments:
Post a Comment