Wednesday, May 9, 2012

గ్రీన్ కర్రీ


Picture  Recipe

కావలసిన పదార్థాలు :

  • తోటకూర. 1 కట్ట
  • పాలకూర. 1 కట్ట
  • cచుక్కకూర. 1 కట్ట
  • మెంతికూర. 1 కట్ట
  • ఉల్లిపాయతరుగు. 1 కప్పు
  • పచ్చిమిర్చి. 3
  • ఆవాలు, 1 టీస్పూ//
  • జీలకర్ర, 1 టీస్పూ//
  • మెంతులు. 1 టీస్పూ//
  • ఎండుమిర్చి. 2
  • నూనె. 3 టీస్పూ//

తయారు చేయు విధానం :

ముందుగా స్టౌ మీద బాణెలి పెట్టి.. అందులో కొద్దిగా నూనె వేయాలి.
వేడయిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
వాటిని పక్కన పెట్టుకుని ఆ బాణెలి లోనే మరికాస్త నూనె వేసి తరిగిన ఆకుకూరలన్నింటినీ వేసి బాగా మగ్గనివ్వాలి.
తరువాత వాటిని దించి చల్లార్చాలి. ముందుగా పోపును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకున్న తరువాత ఆకుకూరను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని తరిగి పెట్టుకున్న ఉల్లితరుగును కలపాలి. అంతే గ్రీన్ కర్రీ సిద్ధం. 

No comments:

Post a Comment