కావలసిన పదార్థాలు :
- అవిసాకు. ¼ కేజి.
- కందిపప్పు. ¼ కేజి.
- పచ్చిమిర్చి. 10 కాయలు
- పచ్చికొబ్బరి కోరు. అర చిప్ప
- ఉప్పు.. సరిపడా
- మినప పప్పు. 2 . టీస్పూ//
- శనగపప్పు. 2 టీస్పూ//
- ఆవాలు. ½ టీస్పూ//
- నూనె. తగినంత చింతపండు..
- కొద్దిగా కరివేపాకు. తగినంత
- కొత్తిమీర - తగినంత
తయారు చేయు విధానం :
నీటిలో ఉడికించి వార్చిన అవిసాకును చేతితో మెత్తగా పిసికి శుభ్రంగా కడిగి నీరు పోయే విధంగా పిండుకోవాలి.
తరువాత అవిసాకు ముద్దను ఉడికించి వార్చిన కందిపప్పులో వేయాలి. ఆపై చింతపండు పులుసును వేసి కలపాలి.
కోరిన కొబ్బరికి కాస్తంత పసుపు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేచి దంచి. ఈ మిశ్రమాన్ని కూడా పప్పులో కలపాలి.
పొయ్యిమీద గిన్నెనుగాని, బాణెలి నిగానీ పెట్టి నూనె
వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు బాగా వేయించి ఆ పోపులో పై
పప్పు మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి.
అయిదు నిమిషాలు సన్నని మంటమీద ఉడికించిన తర్వాత క్రిందకు దించాలి. అంతే వేడి వేడి అవిసాకు పప్పుకూర తయార్.
No comments:
Post a Comment