కావలసిన పదార్ధాలు:
- పెసరపప్పు: ½ కప్పు
- అరటి కాయ ముక్కలు: చిన్నవిగ తరుక్కున్నవి-1 ½ కప్పు
- ఉప్పు:తగినంత
- పసుపు: చిటికెడు
- పచ్చిమిరపకాయలు:2 (నిలువుగా కోసినవి)
- నూనె:2 టీస్పూ//
- ఇంగువ:చిటికెడు
- పోపు:
- ఆవాలు,జీలకర్ర,
- మినప్పప్పు,శనగపప్పు,
- ఎండుమిరపకాయలు.కరివేపాకు
తయారు చేయు విధానం:
ఒక బాణెలి లో పెసరపప్పు వేసి తగినంత నీరు పోసుకుని ఉడికించుకోవాలి కొంచెం పప్పుగానే ఉండాలి.
ఉడికిన పెసరపప్పును జల్లి పళ్ళెంలో వేసి నీరు
వడకట్టుకోవాలి. తర్వాత బాణెలి లో నూనె వేసి పోపు వేసి, వేగాక అరటికాయ
ముక్కలు, పచ్చిమిరపకాయ వేసి, కొద్దిగా నీరు జల్లి తగినంత ఉప్పు, పసుపు
ఇంగువ వేసి మూత పెట్టాలి.
అరటికాయ ముక్కలు ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి.
ఈ కూర dry గా ఉంటంది.
No comments:
Post a Comment