కావలసిన పదార్థాలు
- క్యాబేజీ.. 2 కప్పులు
- చింత చిగురు. 1 కప్పు
- శనగపప్పు, 1 టీస్పూ//
- ఆవాలు, 1 టీస్పూ//
- జీలకర్ర. 1 టీస్పూ// .
- అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ//
- ధనియాలపొడి.. 1 టీస్పూ//
- పసుపు. 1/2 టీస్పూ//
- కారం. 1 టీస్పూ//
- గరంమసాలా. 1 టీస్పూ//
- ఎండుమిర్చి. 4
- ఉల్లిపాయలు. 2
- పచ్చిమిర్చి. 4
- ఉప్పు. తగినంత
- కొత్తిమీర. సరిపడా
- నూనె. తగినంత
తయారు చేయు విధానం :
క్యాబేజి, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి.
బాణిలి లో నూనె వేడయ్యాక శెనగపప్పు, ఆవాలు, జీలర్ర వేసి.. కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి.
తరువాత కొత్తిమీర పేస్ట్, ధనియాలపొడి చల్లి, క్యాబేజీ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.
తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, గరంమసాలా, పసుపు వేసి బాగా కలియబెట్టాలి.
ఈ మిశ్రమం కొద్దిగా మగ్గిన తరువాత కొద్దిగా
నలగ్గొట్టిన చింత చిగురును కలిపి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
అంతే క్యాబేజీ చింత చిగురు కర్రీ రెడీ.
No comments:
Post a Comment