Wednesday, May 9, 2012

ఆలూ-65


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బంగాళాదుంపలు... 4
  • ఉల్లిపాయలు... 2 పెద్దవి
  • తియ్యటి పెరుగు... 1/4 కప్పు
  • పచ్చిమిర్చి... 2
  • అజీనామోటా... 1/2 టీస్పూ//
  • కారం... 1/2 టీస్పూ//
  • బేకింగ్ పౌడర్... 1/4 టీస్పూ//
  • గరంమసాలా... 1/4 టీస్పూ//
  • శనగపిండి... 2 టీస్పూ//
  • ఉప్పు, నూనె... సరిపడా

తయారీ విధానం

బంగాళాదుంప ముక్కలను ఉడికించి తోలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి బేకింగ్ పౌడర్, శనగపిండి, ఉప్పు కలిపి వాటికి పట్టించి ఉంచాలి.
వాటిని వేడినూనెలో ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి. పెరుగును ఒక పల్చటి గుడ్డమీద పోసి నీరు పోయేంతవరకు వడకట్టి దానిని చిలికి మెత్తగా చేసి వుంచుకోవాలి.
ఉల్లి ముక్కలను అంగుళం పొడవుకు కట్ చేసుకొని బాణెలి లో రెండు గరిటెల నూనెను వేసి కాగిన తరువాత నిలువుగా కట్ చేసిన మిర్చి, ఉల్లిముక్కలు, అజినమోటాను వేసి ఎర్రగా వేయించి.. దానికి వడకట్టి మెత్తగా చిలికి పెట్టిన పెరుగును కలపాలి.
ఇందులోనే ఉప్పు, కారం, గరంమసాలా పొడులను చల్లి సన్నని మంటమీద నూనె పైకి తేలేంతవరకూ వేయించాలి.
వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి కొంచెం నీరు పోసి ఉడికించి చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment