కావలసిన పదార్థాలు :
- బంగాళా దుంపలు... 1 కిలో
- సెనగపిండి... 1/2 కప్పు
- ఉల్లిపాయలు... 6
- పచ్చి మిర్చి... 10
- మసాలా పౌడర్... 1 టీస్పూ//
- ఉప్పు... సరిపడా
- కారం... సరిపడా
- పసుపు... చిటికెడు
తయారు చేయు విధానం :
అరకిలో బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా పొడి పొడిగా చిదపాలి.
మూడు ఉల్లిపాయలు, మిరపకాయలను తరిగి దానికి ఉప్పు, పసుపు, మసాలా పొడి కలిపి... చిదిమిన దుంపలకు కలపాలి.
తరువాత దీన్ని ముద్దలుగా తీసుకుని కట్‌లెట్‌ల ఆకారంలో తయారు చేసి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
మిగిలిన అరకిలో బంగాళా దుంపలను ఉడికించి పొట్టు
వలిచి ముక్కలుగా తరగాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాయలు,
దాల్చిన చెక్క, గసగసాలు వేసి ముద్దగా నూరాలి.
బాణెలిలో సరిపడా నూనె వేసి మరిగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, మసాలా ముద్దను కూడా దానికి కలపాలి.
ఆ తరువాత కారం, బంగాళా దుంపలను వేసి వేయించి, దుంపలు మునిగేంత వరకు నీరు పోయాలి.
మూత పెట్టి ఉడికించిన తర్వాత కట్‌లెట్స్ కూడా వేసి... విడిపోకుండా కలియబెట్టాలి.
సరిపోయేంత ఉప్పు వేసి కూర గ్రేవీలా మారిన తర్వాత
దించి, సన్నగా తరిగిన కొత్తి మీర చల్లుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి
చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment