కావలసిన పదార్థాలు :
- దోసకాయలు. 2
- టొమోటోలు. 4
- ఉల్లిపాయ. 1
- నూనె. 1 .టీస్పూ//.
- కరివేపాకు. 2 రెబ్బలు
- జీలకర్ర, ఆవాలు. 1 టీస్పూ//.
- అల్లం వెల్లుల్లి పేస్ట్. 1టీస్పూ//.
- పసుపు. చిటికెడు
- పచ్చిమిర్చి. 2
- కారం.. సరిపడా
- ఉప్పు.. తగినంత
- ధనియాలపొడి.. 1 టీస్పూ//.
- ఎండుకొబ్బరిపొడి.. 1 టీస్పూ//.
- కొత్తిమీర.. తగినంత
తయారు చేయు విధానం :
ముందుగా దోసకాయల్ని చెక్కుతీసి ముక్కలుగా చేసుకోవాలి.
పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉల్లిపాయల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.
పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరువాత ఒకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి.
టొమోటో ముక్కల్ని జతచేసి పది నిమిషాలు వేయించాలి. వేగుతున్న టొమోటో మిశ్రమంలో దోసకాయ ముక్కల్ని వేసి కలియబెట్టాలి.
పదినిమిషాలు అలాగే వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలిపి, మరో పది నిమిషాలు వేయించాలి
దోస ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరిపొడి వేసి కలిపి దించేయాలి. చివర్లో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే సరి.
No comments:
Post a Comment