కావలసిన పదార్థాలు
- బీట్‌రూట్. 1/4 కిలో
- శెనగపప్పు లేక పెసర పప్పు. 2 టీస్పూ//
- కొబ్బరికోరు. 1/4 చిప్ప
- పచ్చిమిర్చి. 8
- ఉప్పు... తగినంత
- పసుపు... కొద్దిగా
తయారు చేయు విధానం :
బీట్‌రూట్ పైతొక్క తీసి నీటిలో కడిగి
తురుముకోవాలి. అలాగే కొబ్బరి కూడా తురుమి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి,
ఉప్పు మెత్తగా దంచి ఉంచాలి.
స్టౌ మీద బాణెలి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె,
అర టీస్పూన్ ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టి తరువాత నానబెట్టిన
శెనగపప్పును, కోరి పెట్టుకున్న బీట్‌రూట్ కోరును వేయాలి.
సన్నని సెగమీద శెనగపప్పు కలియబెడుతూ మెత్తగా ఉడికిన
తరువాత దంచి ఉంచుకున్న కారం, తగినంత పసుపు, కొత్తిమీర, చివరగా కోరిన
కొబ్బరి వేసి 2 నిమిషాలు కలియబెట్టి దించుకుంటే బీట్‌రూట్ కూర రెడీ.
No comments:
Post a Comment