కావలసిన పదార్థాలు
- తెలగపిండి.. 2 కప్పులు
- మెంతులు.. కాసిన్ని
- ఆవాలు.. 1 టీస్పూ//.
- జీలకర్ర.. 1 టీస్పూ//.
- కరివేపాకు. 2 రెమ్మలు
- ఉల్లిపాయ. 1
- వెల్లుల్లి. 2 రెబ్బలు
- నూనె. తగినంత
- ఉప్పు. సరిపడా
తయారీ విధానం
ఒక పాత్రలో తగినన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. తరువాత అందులో మెంతులు వేసి ఉడికించాలి.
పదినిమిషాలు అలా ఉడికించిన తరువాత అందులో ఉప్పు,
తెలగపిండి వేసి. గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉడకబెట్టాలి. పిండి బాగా ఉడికిన
తరువాత దించేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక చిన్న బాణీ లో తగినంత నూనె పోసి కాగాక.
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, చిదిమిన వెల్లుల్లిపాయ వేసి
వేయించాలి.
పోపు బాగా వేగిన తరువాత ఈ మిశ్రమాన్ని ఉడికించిన
పిండిలో వేసి కలియబెట్టాలి. తరువాత ఉప్పు సరిచూసి సర్వ్ చేయాలి. అంతే
తెలగపిండి కూర తయార్.
No comments:
Post a Comment