కావలసిన పదార్థాలు :
- బెండకాయలు... 1/4 కేజి
- టమోటోలు. 4
- ఉల్లిపాయలు. 3
- పచ్చిమిర్చి.. 2
- అల్లం. చిన్నముక్క
- వెల్లుల్లి. 4 రేకలు
- జీలకర్ర. 1/2 టీస్పూ//
- కారం... 1 టీస్పూ//
- ఉప్పు. సరిపడా
- నూనె. 100 గ్రాములు
తయారు చేయు విధానం :
బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరగాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా ముక్కలు తరగాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద
నూరుకొని ఉంచుకోవాలి.
బాణెలి లో నూనె వేసి మరిగాక బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
మిగిలిన నూనెలో కరివేపాకు, జీలకర్ర వేసి కాస్త వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి.
ఆ తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి చిన్న చిన్నగా కోసుకుని ఉంచుకున్న టమోటా ముక్కలను చివర్లో వేసి వేయించాలి.
టమోటాలు బాగా మగ్గిన తర్వాత వేయించి పక్కన
ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఒక కప్పు నీరు పోసి ఉడికించాలి. కూర
చిక్కబడిన తర్వాత దించేయాలి. ఇష్టమైతే కొత్తిమీర చల్లుకోవచ్చు.
No comments:
Post a Comment