కావలసిన పదార్థాలు
- చిక్కుడుకాయ ముక్కలు. 2 కప్పులు
- చింతపండుగుజ్జు. 1 కప్పు
- కారం. 1/2 కప్పు
- నూనె. 1 కప్పు
- ఉప్పు. 1/4 కప్పు
- మెంతులు. 4 టీస్పూ//.
- పసుపు. 1 టీస్పూ//.
- మినప్పప్పు. 1 టీస్పూ//.
- సెనగపప్పు. 1 టీస్పూ//.
- కరివేపాకు. 2 రెబ్బలు
- వెల్లుల్లిపాయలు. 2
- ఆవాలు. 4 టీస్పూ//.
తయారీ విధానం
చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడిగి పొడిబట్టమీద ఆరనివ్వాలి. చింతపండు గుజ్జుని ఓ బాణెలిలో వేసి ఉడికించాలి.
మరో బాణెలిలో సగం నూనె పోసి ఆరిన చిక్కుడుకాయల ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని చింతపండు గుజ్జులో వేయాలి.
ఇప్పుడు మిగిలిన నూనె కూడా బాణెలిలో పోసి పోపు సామాను అంతా వేసి ఎర్రగా వేయించాలి.
అందులోనే పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా
వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత కారం, కరివేపాకు వేసి అన్నింటినీ
చింతపండు గుజ్జులో వెయ్యాలి.
ఉప్పు, పసుపు కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి
పొడిగా ఉన్న సీసాలో పెట్టుకోవాలి. ఒక రోజు ఊరితే బాగుంటుంది. అంతే
చిక్కుడు ఊరగాయ రెడీ .
No comments:
Post a Comment