కావలసిన పదార్థాలు
- పచ్చిమామిడికాయలు. 2 కేజీలు
- మెంతిపొడి. 2 టీస్పూ//. .
- అనాసపువ్వు. 2 టీస్పూ//. .
- కారం. 150 గ్రా.
- ఉల్లి విత్తనాలు. 20 గ్రా.
- జీలకర్ర. 20 గ్రా.
- ఆవాలు. 20 గ్రా.
- పసుపు. 20 గ్రా.
- ఇంగువ. చిటికెడు
- ఆవనూనె. తగినంత
- ఉప్పు. సరిపడా
తయారీ విధానం
మామిడికాయల్ని కడిగి చిన్నముక్కలుగా కోసి ఎండలో పెట్టాలి. అనాసపువ్వు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
తరువాత అందులో ఉల్లివిత్తులు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ కలపాలి.
ఇప్పుడు ఈ కారం మిశ్రమంలో ఆవనూనె వేసి కలపాలి. తరువాత ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి.
దీన్ని జాడీలోకి పెట్టి కిటికీకి దగ్గరగా అంటే
సూర్యకాంతి నేరుగా తగలకుండా ఉండేచోట 15 రోజులపాటు ఉంచాలి. తరువాత అల్మరాలో
పెట్టుకోవచ్చు.
అయితే ఎప్పటికప్పుడు పచ్చడిపైన నూనె ఉందో లేదో చూసుకుంటూ, తగ్గితే కాస్త పోస్తూ ఉండాలి.
అంతే సింధీ ఆమ్ కా అచర్ సిద్ధమైనట్లే.
No comments:
Post a Comment