Thursday, May 3, 2012

వెజ్ చోప్సి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • నూడుల్స్ - ఒక ప్యాకెట్
  • కేరట్ - 3 సన్నగా పొడుగు తరిగిన ముక్కలు
  • బీన్స్ : ఇరవై - చిన్న చిన్న ముక్కలు తరగాలి
  • కాబేజీ : ఒక చిన్న ముక్క, సన్నగా తరగాలి
  • అల్లం: ఒక చిన్న ముక్క, సన్నగా , చిన్న చిన్న ముక్కలు తరగాలి
  • వెల్లుల్లి: నాలుగు రెబ్బలు , చిన్న చిన్న ముక్కలు తరగాలి
  • ఉల్లిపాయలు: రెండు, సన్నగా , చీలికలుగా తరగాలి
  • కార్న్ ఫ్లోర్ : రెండు టేబుల్ స్పూన్లు
  • నూనె: వేయించటానికి సరిపడా
  • మిరియాల పొడి : అర టీ స్పూను, పొడి చెయ్యాలి
  • అజినమోటో: పావు టీ స్పూను
  • పంచదార: ఒక టీ స్పూను
  • టమాట సాస్: మూడు టేబుల్ స్పూన్లు
  • వేనిగర్ : ఒక టేబుల్ స్పూను
  • ఉప్పు : రుచుకి సరిపడా

తయారీ విధానం

ముందుగా ఒక బాణెలిలో నూడుల్స్ మునిగేలాగ నీరు పోసి , ఆ నీటిలో ఒక స్పూను ఉప్పు , ఒక స్పూను నూనె వేసి బాగా మరగనివ్వాలి.
తరువాత నూడుల్స్ ని ఆ నీటిలో వేసి బాగా ఉడకనివ్వాలి. నూడుల్స్ ఉడికాక వాటి నుండి నీరు తీసేసి ఒక చిల్లుల పళ్ళెంలో వేసి పక్కన పెట్టి బాగా ఆరనివ్వాలి. ఈ వేడి నూడల్సు పై చల్లటి నీరు పోసి వెంటనే చల్లారిస్తే నూడుల్స్ వేడికి అంటుకుపోకుండా ఉంటాయి.
ఇప్పుడు ఒక బాణెలిలో వేయించటానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. బాగా ఆరిన నూడుల్స్ ఒక దోసెడు తీసుకొని ,పక్షి గూడులుగా, చేసి కాగిన నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అలా ఉడకబెట్టిన నూడుల్స్ అన్నిటిని వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక బాణీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో సన్నగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి వేసి వేగనివ్వాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న కేరట్, వేగనివ్వాలి కాబేజీ బాణీలో వేసి కూరలు ఉడికేదాకా వేగనివ్వాలి.
కూరలు కొంచెం ఉడికినా ఇంకా కరకరలాడేలాగే ఉండాలి. ఇప్పుడు మిరియాల పొడి, అజినమోటో, ఉప్పు మరియు పంచదార వెయ్యాలి. తరువాత టమాట సాస్ మరియు వెనిగర్ కూడా వెయ్యాలి. ఇప్పుడు రెండు గ్లాసుల నీరు పోసి బాగా ఉడకనివ్వాలి( కూరలు ఉడక పెట్టినప్పుడు వచ్చిన నీరు ఉన్నా పొయ్యవచ్చు) .
రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని , దానిలో సరిపడా నీరు పోసి ఆ కార్న్ ఫ్లోర్ నీటిని బాణిలో ఉడుకుతున్న మిశ్రమం లో పోసి బాగా కలపాలి. సాస్ లాగా చిక్కపడేవరకు గ్యాస్ మీద ఉంచాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో వేయించి పెట్టుకున్న నూడుల్స్ ముందుగా పెట్టి దానిమీద ఇందాక తయారుచేసిన సాస్ వేడి వేడిగా పోసి సర్వ్ చెయ్యాలి. చోప్సీ రెడీ......

No comments:

Post a Comment