Thursday, May 3, 2012

రవ్వ దోసె

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • రెండు కప్పుల రవ్వ (ఉప్మా రవ్వ, లేక బొంబాయి రవ్వ)
  • అర కప్పు మైదా (వద్దనుకున్నవారు గోధుమపిండి వాడవచ్చు)
  • అర కప్పు బియ్యం పిండి
  • ౧ లేదా ౨ పచ్చిమిరపకాయలు (సన్నగా తరిగిన ముక్కలు)
  • కోరిన అల్లం - ఒక చెంచాడు
  • జీలకర్ర - ఒక చెంచాడు
  • మిరియాలు - ఒక చెంచాడు
  • ఉప్పు తగినంత
  • నీళ్ళు - షుమారుగా ఆరు కప్పులు
  • దోసె వేసుకోవడానికి నూనె

తయారీ విధానం

పైన అన్ని పదార్ధాలను చక్కగా కలుపుకొని (ఉండలు లేకుండా) దోశె పిండి తయారు చేసుకోవాలి.
దీనిని ఒక ౧౫ నిమిషాలు నానవివ్వాలి. నానిన తర్వాత నీటి శాతం తగ్గుతుంది (రవ్వ పీల్చుకోవడం వల్ల) దీనికి కొంచం నీటిని కలుపుకోవాలి (దోశె పిండి పలచని మజ్జిగ లాగ తయారవ్వాలి).
ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టుకొని, ఒక నిమిషం వేడి సెగమీద ఉంచుకోని, చల్లని నీరు చిలకరించగానే ఆవిరి అయ్యేంత వేడిగా చూసుకోవాలి.
పెనం అంతా కలిసేట్లు నూనె చెంచాతో నూనె వేసుకోవాలి.
దోశె పిండిని గరిటలో తీసుకొని, పెనం అంతా పల్చగా పరుచుకునేట్లు వేసుకోవాలి (మినప దోసెలను, పింది అంత ఒక చోట వేసి, తిప్పుతూ పరుస్తాం. కాని రవ్వ దోశెలను అలా చెయ్యకూడదు).
ఇక్కడా ఖాళీలు లేకుండా దోశె పోసుకోవాలి.
మధ్యమైన సెగ మీద దోశెని కాల్చుకోవాలి - మెత్తగా ఉండాలంటే కొంచెం త్వరగానూ, బాగా కరకరలడాలంటే కొద్దిగా ఎక్కువ సేపు ఉంచుకోవాలి.
విడిన దోశెను అట్లకాడతో తీసుకోవాలి

No comments:

Post a Comment