కావలసినవి వస్తువులు:
- జీడిపప్పులు - 150 గ్రా.
- శనగపిండి - 100 గ్రా.
- బియ్యప్పిండి - 50 గ్రా.
- కారం - టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 6
- జీలకరప్రొడి - టీ స్పూను
- కరివేపాకు - రెండు రెమ్మలు
- నూనె - వేయించడానికి తగినంత
- ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం,
పచ్చిమిర్చి తరుగు, తగినంత నీరు జీలకరప్రొడి, కరివేపాకు, ఉప్పు వేసి పకోడీల
పిండి మాదిరిగా కలుపుకోవాలి.
తరవాత జీడిపప్పులను కూడా వేసి మరోమారు కలపాలి.
స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత పకోడీలుగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.
No comments:
Post a Comment