కావలసిన పదార్థాలు
- బంగాళాదుంపలు.350 గ్రా
- సెనగపిండి. 60 గ్రా
- బియ్యం పిండి. 1 టీస్పూ//
- ఉప్పు. 2 టీస్పూ//
- పచ్చిమిర్చి. 5
- అల్లం. కొంచెం
- ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఇంగువ,
- నూనె. తాలింపుకు సరిపడా
తయారీ విధానం
ఉడికించిన బంగాళాదుంపల్లో సెనగ పిండిని చేర్చి, ఆ
మిశ్రమానికి ఉప్పు, బియ్యం పిండి, నూనెలో వేయించిన ఆవాలు, పచ్చి మిరప
కాయలను కలపాలి.
అలాగే కొత్తిమీర, ఇంగువ, కరివేపాకులను కూడా దానికి చేర్చి ముద్దలా చేసుకోవాలి.
ఆ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లాగా కాగుతున్న నూనెలో బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి.
అంతే బంగాళాదుంపలతో గారెలు సిద్ధమైనట్లే.
No comments:
Post a Comment