కావలసిన పదార్థాలు
- బాగ కడిగి తరుగుకున్న తోటకూర - రెండు కట్టలు
- శెనగపిండి - అర కప్పు
- అల్లం-వెల్లుల్లి ముద్ద (వెల్లుల్లి వాడనివారు అల్లం కోరుకొని వేసుకోవచ్చు)
- జీలకర్ర - తగినంత
- పచ్చి మిరపకాయలు - రెండు
- మిర్చి పొడి - అర చెంచా
- ఉప్పు - తగినంత
- నూనె - తగినంత
- నీరు - తగినంత
తయారీ విధానం
ముందు ఒక గిన్నెలో, తరుగుకున్న తోటకూర, సన్నగా
తరుగుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి ముద్ద, కొంచెం
మిర్చిపొడి, జీలకర్ర, శెనగ పిండి, ఉప్పు వేసి. ఉండల్లా చేసుకోవాలి.
అవసరమైతే కొంచం నీటితో తడుపుకొని ఉండాలని చేసుకోవచ్చు.
ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసుకొని, స్టవ్వు మీద
పెట్టుకొని, ఉండల్ని వేపుకునేంత వేడి అయిన తర్వాత, ఒక్కొక్క ఉండని
వేసుకొని, ఎర్రగా వేపుకోవాలి.
ఈ ఉండాలని వేడి వేడి గా తింటే బాగుంటుంది. అల్లం చట్నీ లేదా సాస్ తో తినవచ్చు
No comments:
Post a Comment