కావలసిన పదార్థాలు
- అల్లం.. 50 గ్రా.
- బెల్లం.. 100 గ్రా.
- చింతపండు.. 50 గ్రా.
- ఎండుమిర్చి.. 20
- నూనె.. 1/2 కప్పు
- ఉప్పు.. తగినంత
- పోపు కోసం..
- మినప్పప్పు.. 2 టీస్పూ//
- శెనగపప్పు.. 2 టీస్పూ//.
- మెంతులు.. 1/2 టీస్పూ//
- జీలకర్ర.. 1 టీస్పూ//.
- కరివేపాకు.. కొద్దిగా
తయారీ విధానం
అల్లం శుభ్రంగా కడిగి, తొక్కు తీసేసి, చిన్నచిన్న ముక్కలుగా కోయాలి.
పాత్రలో నూనె వేసి అల్లంముక్కలు రంగు మారి మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి.
చింతపండు కడిగి, కొద్ది నీళ్లలో నాన బెట్టాలి.
బాణలిలో కొద్దిగా నూనెవేసి ఎండుమిర్చి వేసి వేయించాలి.
చల్లారాక ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి.
తరువాత అల్లంముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి.
అల్లం వేయించి తీసిన నూనెనే మళ్లీ వేడి చేసి ఒక్క కరివేపాకు తప్ప మిగిలిన పోపు (తాలింపు)
గింజల్ని వేసి తాలింపు చేయాలి.
స్టవ్మీద నుంచి దించాక కరివేపాకు వేసి పోపుని (తాలింపుని) చట్నీలో కలపాలి.
ఆరాక దీన్ని పొడిగా ఉన్న సీసాలో పెట్టుకుంటే కనీసం ఓ వారం రోజులునిల్వ ఉంటుంది.
No comments:
Post a Comment