కావలసిన పదార్థాలు
- దోసకాయ-1
- ఎండుమిర్చి(ఇంట్లో తినే కారాన్ని బట్టి)
- పసుపు-తగినంత
- నూనె-తగినంత
- ఉప్పు-తగినంత
తయారీ విధానం
వంకాయ మాదిరిగానే దోసకాయకు కూడా నూనే రాసి కాల్చి పొట్టు తీసి ఒక ప్లేటులో ఉంచాలి.
తరువాత చింతపండు నానబెట్టుకోవాలి.
ఎండుమిర్చి వేపుకుని, తగినంత ఉప్పు ,పసుపు చింతపండు చేర్చి నూరుకోవాలి.
మెత్తగా నూరుకున్నతర్వాత ఆఖరిగా కాల్చిన దోసకాయ కూడా కలిపి ఇంకోసారి నూరుకోవాలి.
చివరిగా ఇంగువ పోపు పెట్టుకోవాలి. తీపి ఇష్టపడేవారు బెల్లం కూడా వేసుకోవచ్చు.
No comments:
Post a Comment